గర్భిణికి గ్రూప్ మార్చి రక్తం ఎక్కించిన వైద్యులు


ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు

ఓ పాజిటివ్ బ్లడ్ కావడంతో తప్పిన పెనుముప్పు


 

ఎంజీఎం : వరంగల్‌లోని సీకేఎం మెటర్న టీ ఆస్పత్రి వివాదాలకు నిలయంగా మారుతోంది. నెల రోజుల క్రితం శిశు మార్పిడి జరిగిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన విషయం మరువక ముందే బుధవారం ఓ గర్బిణీకి బీ పాజి టివ్  గ్రూప్ రక్తానికి బదులు ఓ పాజిటివ్ గ్రూప్ రక్తం ఎక్కించి మరో వివాదానికి తెర తీశారు. అయితే ఓ పాజిటివ్ రక్తం యూనివర్సల్ బ్లడ్ గ్రూపు రక్తం కావడంతో గ ర్భిణికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడంతో సీకేఎం పరిపాలనాధికారులతో వైద్య సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. నర్సంపేట డివిజ న్ గిర్నిబావికి చెందిన స్వాతి అనే గర్భిణిని మంగళవారం సాయంత్రం 4 గంటలకు సీకేఎం ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఆమె కు రక్తం తక్కువగా ఉండడంతో రక్తాన్ని అం దుబాటులో ఉంచాల్సిందిగా తెలి పారు. అయితే గర్భిణీ బ్లడ్ గ్రూపు బీ పాజిటివ్ కాగా ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న రంజిత్ అనే ల్యాబ్ టెక్నీషియన్ ఓ పాజిటివ్‌గా పేర్కొంటూ రక్తాన్ని రెం డు యూనిట్లు అందుబాటులో ఉంచాల్సిందిగా పేర్కొన్నాడు.



అనంతరం బ్లడ్ శాంపిల్ నమూనాతోపాటు కేస్ షీట్‌ను బంధుమిత్రులకు అందించి రక్తం తేవాల్సిందిగా పేర్కొన్నారు. బంధువులు వెళ్లి ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్‌లో శాంపిల్ ఇవ్వగా ఎలాంటి క్రాస్ మ్యాచింగ్ చేయకుండానే ఓ పాజిటివ్ రక్తాన్ని అందించారు. దీంతో స్వాతికి అదే రక్తం ఎక్కించారు. అయితే ఓ పాజిటివ్ యూనివ ర్సల్ బ్లడ్ గ్రూపు కావడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా గర్భిణి సురక్షితంగా ఉంది. అరుు తే మళ్లీ స్వాతి బ్లడ్‌గ్రూపు శాంపిళ్లను ఎం జీఎం బ్లడ్‌బ్యాంక్‌తోపాటు సీకేఎం ఆస్పత్రిలో పరీక్షించగా ఆమె రక్తం బీ పాజిటివ్ బ్లడ్‌గా తేలింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేసి బాధ్యులపై చర్య తీసుకుంటామని సీకేఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ తెలిపారు. అంతేగాక ఎంజీఎం బ్లడ్‌బ్యాంక్ తీరుపై ఎంజీఎం పరిపాలనాధికారులకు కూడా ఫిర్యాదు చేస్తామని ఆర్‌ఎంఓ పుష్పేందర్‌నాథ్ పేర్యొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top