రైతులపై జీఎస్టీ భారం వద్దు

రైతులపై జీఎస్టీ భారం వద్దు


కేంద్రం తీరుపై హరీశ్‌ అసంతృప్తి

సాక్షి, మెదక్‌/దుబ్బాక రూరల్‌: రైతులపై అద నపు భారం పడేలా కేంద్రం ఎరువులపై జీఎస్టీ వేయటం సరికాదని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు అన్నారు. జీఎస్టీతో ఎరువుల ధరలు పెరుగుతాయని, తద్వారా రైతులపై మరింత భారం పడుతోందని చెప్పా రు.


సోమవారం డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవేందర్‌రెడ్డితో కలసి మెదక్‌లో ఆయన పర్య టించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బీడీ కార్మికులకు జీవన భృతి పత్రాలు అందజే శారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రం వెంటనే ఎరువులపై జీఎస్టీ ఎత్తివే యాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు. వరి మద్ద తు ధర పెంచాలని కేంద్రాన్ని పలుమార్లు కోరామని,అయినా స్పందించడం లేదన్నారు. ఉత్తర భారత్‌లో అధికంగా సాగయ్యే గోధు మల మద్దతు ధర పెంచిందని, తెలంగాణలో రైతులు అత్యధికంగా సాగు చేసే వరి మద్దతు ధర మాత్రం పెంచటంలేదని అన్నారు.



బీడీ కార్మికులకు జీఎస్టీ దెబ్బ

బీడీ కార్మికులకు జీఎస్టీ రూపంలో దెబ్బ పడ నుందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీలో బీడీ కార్మికులకు పన్ను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. కేంద్రం పన్ను విధిస్తూ కార్మికుల పొట్ట కొడుతుందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని హరీశ్‌ చెప్పారు. గత ప్రభు త్వాలు కులవృత్తులను విస్మరిస్తే, కేసీఆర్‌ కులవృత్తిదారుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. విదేశాల్లో చదివే బీసీ విద్యార్థుల కోసం రూ.20 లక్షలు అందజేస్తున్నామని హరీశ్‌ చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top