లక్ష్యానికి దూరంలో భూగర్భ గనులు


  • అత్యాధునిక యంత్రాలు ఉన్నా ఫలితం శూన్యం

  • ఉత్పత్తి భారమంతా ఓపెన్‌కాస్టు గనులపైనే

  • కొత్తగూడెం(ఖమ్మం) : అత్యాధునిక యంత్రాలు సమకూర్చినా నిర్ధేశించిన లక్ష్యాలను అందుకోవడంలో భూగ ర్భ గనులు ఇంకా వెనుకబాటులోనే ఉన్నాయి. ఇప్పటికే విద్యుత్‌లోటును ఎదుర్కొంటున్న తె లంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేసే థర్మల్ పవర్‌ప్రాజెక్టులకు విద్యుత్ ఉత్పత్తిపై సింగరేణిపైనే ఎక్కువగా ఆధారపడింది. ఈ నేపథ్యం లో వాటి అవసరాల మేరకు బొగ్గు ఉత్పత్తి చే యాల్సిన బాధ్యత సింగరేణి సంస్థపై పడింది.



    ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు గనుల్లో వినియోగి స్తున్న అత్యాధునిక యంత్రాలను మన గనుల్లో వినియోగిస్తునప్పటికీ ఆశించిన ఫలితాలు రావడంలేదు. ఇందుకు యంత్రాలను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేక పోవడం.. అధికారుల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యం కారణంగా చెప్పుకోవచ్చు. సంస్థ వ్యాప్తంగా 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు ఉన్నాయి. భూగర్భ గనులు నిర్ధేశించిన లక్ష్యంలో కనీసం 70 శాతం కూడా చేరుకోలేక పోతున్నాయి. దీంతో ఆ భారమంతా ఓపెన్‌కాస్టు గనులపై పడుతోంది. ప్రతి ఏటా భూగర్భ గనుల ఉత్పత్తి లోటును ఓసీలే పూడ్చుతున్నాయి.

     

    యంత్రం వినియోగంలో విఫలం




    ప్రస్తుతం రెండు భూగర్భ గనుల్లో అత్యంత ఆధునికమైన కంటిన్యూయస్ మైనర్లు పనిచేస్తున్నాయి. మిగతా వాటిలో 147 ఎల్‌హెచ్‌డీ యంత్రాలు, 240 ఎస్‌డీఎల్ యంత్రాలను వినియోగిస్తున్నారు. వీటితోపాటు రోడ్‌హెడర్, లాంగ్‌వాల్ యంత్రాలను ఉత్పత్తిలో వాడుతున్నారు. యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో అధికారులు విఫలం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విదేశాలలో ఒక్కో యంత్రాన్ని రోజుకు కనీసం 16 గంటల పాటు వినియోగిస్తుండగా ఇక్కడ మాత్రం షిఫ్టుకు కేవలం నాలుగు గంటలు మాత్రమే పని తీసుకోవడంతో లక్ష్యం చేరుకోవడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.

     

    గతేడాదికంటే తగ్గిన ఉత్పత్తి



    ఇప్పటి వరకు సింగరేణి వ్యాప్తంగా ఉన్న 34 భూగర్భ గనుల్లో 8.07 మిలియన్ టన్నుల బబొఉత్పత్తి చేయాల్సి ఉండగా కేవలం 5.35 మిలియన్ టన్నులు మాత్రమే వెలికితీశారు. ఇదే సమయానికి గత ఏడాది 5.81 మిలియన్ టన్నులు వెలికితీశారు. ఈ పరిస్థితి రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇటీవల సింగరేణి బోర్డు సమావేశంలో సైతం ప్రధానంగా భూగర్భ గనుల్లో ఉత్పత్తిని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనే చర్చించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా భూగర్బ గనులను గాడిలో పెడితేనే ఉత్పత్తి లక్ష్యసాధన సులభమవుతుందని అధికారులు చర్చించుకుంటున్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top