ప్రజల్లోకి ప్రభుత్వం

ప్రజల్లోకి ప్రభుత్వం - Sakshi


బహిరంగ సభలు పెట్టి

{పభుత్వ విధానాలపై వివరణ!

{పజల్లో ఆదరణ, ప్రతిపక్షాలకు కళ్లెం... ఇదే కేసీఆర్ వ్యూహం


 

హైదరాబాద్: ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలపై ప్రజల్లోకి వెళ్లాలని టీఆర్‌ఎస్ సర్కారు భావిస్తోందా..? సంక్షేమ పథకాల నుంచి సాగునీటి ప్రాజెక్టుల వరకూ ప్రజల అభిప్రాయం సేకరించాలని యోచిస్తోందా..? ఇందుకోసం బహిరంగ సమావేశాలు, సభలు నిర్వహించి.. అందుకు అనుగుణంగా వ్యవహరించాలని యోచిస్తోందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఔననే సమాధానమే వస్తోంది. ప్రజల్లో ఆదరణ పొందడంతోపాటు ప్రతిపక్షాల దూకుడుకు కళ్లెం వేసేందుకే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఈ వ్యూహం పన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యూహంలో భాగంగానే అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను పక్కనపెట్టిన కేసీఆర్... ‘చీప్‌లిక్కర్’పై తమంతట తామే వెనక్కి తగ్గారనే భావన వస్తోం ది. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, చేపట్టే కార్యక్రమాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు సర్కారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం పరిపాటి.



అఖిలపక్ష భేటీలో వివిధ పార్టీల సూచనలు, సలహాలకు అనుగుణంగా సవరణలు చేసి... వ్యతిరేకత నుంచి ప్రభుత్వాలు గట్టెక్కుతుంటాయి. కానీ  కేసీఆర్ మాత్రం అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం కంటే ప్రజల నుంచే నేరుగా అభిప్రాయాలు సేకరించి, దానికి అనుగుణంగా నడుచుకునే దిశగా ముందుకు వెళుతున్నారు. ‘గ్రామజ్యోతి’లో భాగంగా ఇటీవల ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటించినప్పుడూ ఇదే పంథాను అనుసరించారు. ఆ తర్వాత చౌక మద్యం తేవాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌తో పాటు బీజేపీ, వామపక్షాలు అఖిల పక్ష సమావేశానికి డిమాండ్ చేసినా కేసీఆర్ పట్టించుకోలేదు. కానీ ఇదే సమయంలో ‘చౌక మద్యం’పై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకొనేందుకు తమ పార్టీ శ్రేణులను ఉపయోగించుకున్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇదే సమయంలో ‘చౌక మద్యం’ను నిరసిస్తూ కాంగ్రెస్ ప్రాంతీయ సదస్సులు నిర్వహించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వ్యూహాలు కూడా రూపొందించుకుంది. కానీ సీఎం అనూహ్యంగా ‘చౌక మద్యం’ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు. ప్రాణహిత-చేవెళ్ల సహా ప్రాజెక్టుల రీడిజైన్ యోచనను విపక్షాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో నూతన జలవిధానానికి శ్రీకారం చుట్టిన ఆయన... దానినీ ప్రజల ముందుంచేందుకు కసరత్తు మొదలుపెట్టారు. అసెం బ్లీ కంటే ముందే కొత్త జల విధానాన్ని ప్రజలకు వివరించేందుకు బహిరంగ సమావేశాలు నిర్వహించాలని సీఎం భావిస్తున్నారు. ‘అఖిలపక్ష సమావేశాలకు పిలిచి వారు చెప్పే అభిప్రాయాలు విని అమలు చేయడం కంటే ప్రభుత్వం తనకున్న విజన్‌ను ప్రజల ముందుంచడమే మా ముఖ్యమంత్రి లక్ష్యం. దానికి అనుగుణంగా వెళుతున్నాం..’ అని ఓ సీనియర్ మంత్రి పేర్కొనడం గమనార్హం.



 ముందస్తు వ్యూహంలో భాగంగానే..

అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు ఏఅంశాలతో సిద్ధమై వస్తాయో ఇప్పటికే  ఓ అంచనాకు వచ్చిన అధికార పార్టీ... అందుకు తగ్గట్టే దీటుగా సిద్ధమవుతోంది. ప్రాజెక్టులు, డబుల్ బె డ్‌రూం ఇళ్లు, గత ఇందిరమ్మ ఇళ్ల పెండింగ్ బిల్లులు వంటి అంశాలు ఇబ్బందికరంగా మారే అవకాశమున్నందునే... వాటిపై కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై జరుగుతున్న రాద్ధాంతానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు, ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top