కొత్త ప్రాజెక్టులపై గరంగరం!

కొత్త ప్రాజెక్టులపై గరంగరం!


కాళేశ్వరం,తుపాకులగూడెం, సీతారామ కొత్తవే

గోదావరి బోర్డు ముందు ఆంధ్రప్రదేశ్‌ వాదన

అవి పాతవేనన్న తెలంగాణ


సాక్షి, హైదరాబాద్‌: గోదావరి బేసిన్‌ పరిధిలో తెలుగు రాష్ట్రాలు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల పై బోర్డు సమావేశంలో గరంగరంగా చర్చ జరిగింది. మీ ప్రాజెక్టులు కొత్తవంటే మీ ప్రాజె క్టులు కొత్తవంటూ ఇరు రాష్ట్రాలు వాదించుకు న్నాయి. ముఖ్యంగా తెలంగాణ చేపట్టిన కాళేశ్వ రంతో పాటు తుపాకులగూడెం, సీతారామ, ప్రాణహిత ఎత్తిపోతలపై ఏపీ అభ్యంతరాలపై చర్చ జరిగింది. బేసిన్‌ పరిధిలోని సమస్యలపై గోదావరి బోర్డు చైర్మన్‌ హెచ్‌కే సాహూ అధ్యక్ష తన శుక్రవారం ఇక్కడి జలసౌధలో బోర్డు సమావేశం జరిగింది. సభ్య కార్యదర్శి సమీర్‌ చటర్జీ, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ కార్య దర్శులు ఎస్‌కే జోషి, శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీలు మురళీధర్, వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



బచావత్‌లోనే లేని ‘పురుషోత్తపట్నం’

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతుల్లేవని, బోర్డుకూ సమాచారమివ్వకుండా చేపట్టారని ఏపీ ఆరో పించింది. ప్రాజెక్టు డీపీఆర్‌ను బోర్డు ముందు పెట్టాలంది. తుపాకులగూడెం, ప్రాణహిత, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాల్లోనూ ఏ అనుమతులూ లేకుండా అనేక మార్పులు చేశారంది. ఇందుకు తెలంగాణ అభ్యంతరం చెప్పింది.



కాళేశ్వరంసహా ఏ ప్రాజెక్టులూ కొత్తవి కావని, రీఇంజనీరింగ్‌లో భాగంగా గోదావరి లో తమ నిర్ణీత 954 టీఎంసీల వాటాను విని యోగించుకుంటూనే చేపడుతున్నామని స్పష్టం చేసింది. ఏపీ చేపట్టిన పురుషోత్తపట్నం, పట్టిసీ మ, తాడిపూడి, పుష్కర, వెంకటాపురం ప్రాజె క్టులను ప్రస్తావించింది. ‘‘గోదావరి జలాల్లో ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయిం చిన 1,486టీఎంసీల వినియోగంలో పురుషోత్త పట్నం ప్రస్తావన ఎక్కడా లేదు. తర్వాత కూడా దీని వివరాలేవీ గోదావరి బోర్డుకు ఏపీ చెప్ప లేదు’’ అని బోర్డు దృష్టికి తెచ్చింది. వీటి డీపీఆర్‌లను బోర్డు ముందు పెట్టాలని కోరింది.



దాంతో, బేసిన్‌ పరిధిలోని కొత్త, పాత ప్రాజెక్టుల వివరాలన్నీ తమకివ్వాలని, వాటిని బోర్డు వెబ్‌సైట్లో పొందుపరుస్తామని బోర్డు తెలిపింది. ఇందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరిం చాయి. పట్టిసీమ నుంచి తరలిస్తున్న మళ్లింపు జలాల వాటాలపై తెలంగాణ ప్రశ్నించింది. దీనిపై కృష్ణా బోర్డు వద్దే తేల్చుకుందామని ఏపీ చెప్పింది. బోర్డు నిర్వహణకు 54 మందిని కేటాయించాలని బోర్డు కోరగా 25 మందిని ఇచ్చేలా అంగీకారం కుదిరింది. తమ నిర్వహణ కయ్యే రూ.10 కోట్ల ఖర్చును పూర్తిగా తెలం గాణే కాకుండా ఇరు రాష్ట్రాలు సమానంగా భరించాలన్న బోర్డు సూచనకూ ఆమోదం దక్కింది. ప్రాజెక్టులపై పర్యవేక్షణ, నిర్వహణకు సంబంధించి బోర్డు వర్కింగ్‌ మ్యాన్యువల్‌ ఎలా ఉండాలో 10 రోజుల్లో బోర్డుకు అభిప్రాయాలు తెలిపేందుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి.



కృష్ణా పాత ముసాయిదాకు ఓకే

అనంతరం ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు కృష్ణా బోర్డు చైర్మన్‌ శ్రీవాత్సవతోనూ భేటీ అయ్యారు. కేంద్ర జల వనరుల శాఖ సూచించినట్టే ఈ ఏడాదీ నీటిని పంచుకునేందుకు సూత్రప్రాయ అంగీకారానికి వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కేంద్రానికి లేఖ రాస్తామని తెలంగాణ అధికారులు పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top