కేంద్ర విధానాలతో రైతులకు కష్టాలు

కేంద్ర విధానాలతో రైతులకు కష్టాలు

- రైతులకు రూ.6 వేల కోట్లు విడుదల చేయాలి

- మంత్రి హరీశ్‌రావు

 

సాక్షి, సిద్దిపేట: కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేటలో డీసీసీబీ ప్రధానశాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారం భించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. నోట్ల రద్దుతో బ్యాంకుల్లో డబ్బులు లేకుండా పోయాయని, దీంతో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైనా రైతులు పెట్టుబడులకు డబ్బులు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద క్యూ కట్టాల్సి వస్తోందని అన్నారు. గతంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు ఇబ్బందులు పడే వారని, ఇప్పుడు డబ్బుల కోసం బ్యాంకుల వద్ద ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పారు.



రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కేంద్రమంత్రులు దత్తాత్రేయ, వెంకయ్య చొరవ చూపాలని  హరీశ్‌రావు కోరారు. ఈ వ్యవసాయ సీజన్‌లో రాష్ట్రంలోని బ్యాం కులకు రూ.6 వేల కోట్లు నగదు రూపం లో విడుదల చేసి రైతుల కష్టాలను తీర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల చేసిందని, బ్యాంకర్లు మాత్రం కొత్త క్రాఫ్‌ రుణాలు అందించడంలో డబ్బులు లేవనే సాకు చూపిస్తున్నారని, కేంద్రం డబ్బులు విడుదల చేస్తే ఈ సమస్య తీరుతుందన్నారు. యాసంగి సీజన్‌లో 20 నుండి 30 శాతం వరకు పంటల దిగుబడి పెరిగిందని, దీంతో రూ.60 వేల కోట్లతో 40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించాలని కోరారు. వరి, పత్తి, మొక్కజొన్నలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర సరిపోదని, దీన్ని పెంచాలని కోరారు.
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top