విభేదాలు వీడండి


టవర్‌సర్కిల్ : జిల్లా నియోజకవర్గాల కార్యకర్తలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీల పనితీరు, అందుబాటులో ఉంటున్నారా? సమస్యలేమున్నారుు? అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు. 13 నియోజకవర్గాలకు సంబంధించి రెండున్నర గంటల పాటు జరిగిన సమీక్షలో ఇన్‌చార్జీల పనితీరు, పార్టీ బలోపేతానికి చేపట్టే చర్యలు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యక్రమాలను పెంచుకునే విధానంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

 

  హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ముద్దసాని కశ్యప్‌రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడడంతో బాబు ఒకింత ఆగ్రహానికి గురై నాముందే విమర్శలు చేసుకోవడం తగదని, కలిసికట్టుగా పనిచేయూలని మందలించారు. కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధించి ఇన్‌చార్జి లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే నియమించాలని నగర అధ్యక్షుడు కళ్యాడపు ఆగయ్య కోరడంతో ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం లేదని, త్వరలో హైదరాబాద్‌కు వస్తే పూర్తి విషయాలు మాట్లాడదామంటూ సూచించారు.

 

 రామగుండం ఇన్‌చార్జి నియామకంపై సందిగ్ధం తొలగించాలని, వేములవాడ నియోజకవర్గంలో గండ్ర నళిని స్థానికంగా ఉండేలా చూడాలని లేనిపక్షంలో మరొకరికి ఇవ్వాలని కోరారు. మానకొండూర్, ధర్మపురి, చొప్పదండి, హుస్నాబాద్, పెద్దపల్లి, జగిత్యాల నియోజకవర్గాల్లో పనితీరు బాగా ఉందని కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ మరిన్ని కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. స్వాగత ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన కొండూరి అంజయ్య, హుస్నాబాద్ నియోజకవర్గం మైసంపెల్లికి చెందిన పద్మకు, ధర్మపురి నియోజకవర్గం పెగడపల్లికి చెందిన మోహన్‌నాయక్ కుటుంబాలు పార్టీ సహాయాన్ని కోరగా రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

 

 ఆలస్యంగా వచ్చి ముందే వెళ్లిన బాబు

 ప్రతినిధుల సభ, నియోజకవర్గాల సమీక్ష కోసం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఆలస్యంగా వచ్చి ముందే కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ వెళ్లారు. ఉదయం 12.30కి వేదికపైకి రావాల్సిన బాబు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారు. సభ సాయంత్రం 6 గంటల వరకు జరిగింది. 6.30కు ప్రారంభమైన 13 నియోజకవర్గాల సమీక్ష రెండున్నర గంటల్లోనే ముగించారు. రాత్రి 12 గంటల వరకు నియోజకవర్గాల సమీక్షలు జరుగుతాయని, రాత్రి కరీంనగర్‌లోనే బస చేసి గురువారం ఉదయం హెలికాప్టర్‌లో తిరిగి వెళ్తారని షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ రాత్రి 9 గంటలకే ఆయన తిరుగుప్రయూణమయ్యూరు. సభ నిర్వహణ బాగుందని జిల్లా నేతలను  చంద్రబాబు అభినందించారు.

 

 సభలో అట్రాక్షన్ రేవంత్, నన్నూరి

 టీడీఎల్పీ ఉప నేత రేవంత్‌రెడ్డి మంగళవారం జరిగిన సభలో అట్రాక్షన్‌గా మిగిలారు. రేవంత్‌రెడ్డి మాట్లాడినంత సేపు సభికుల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్ర పార్టీ నేత నన్నూరి నర్సిరెడ్డి సభలో కేసీఆర్ కుటుంబంపై, ప్రభుత్వ విధానాలపై విమర్శల వాన కురిపిస్తూ గతంలో టీడీపీ హయంలో జరిగిన అంకెలతో సహా వివరిస్తూ చేసిన ప్రసంగం చంద్రబాబుతో సహా వేదికపై ఉన్న నాయకులు, సభికుల నుంచి నవ్వుల జల్లులు కురిపించాయి.  

 

 నగర శివారులోని అల్గునూరు బ్రిడ్జి వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ కాన్వాయ్‌తో కార్యకర్తలు వెంట రాగా బాబు అభివాదం చేసుకుంటూ కోతిరాంపూర్, కమాన్ మీదుగా అంబేద్కర్ స్టేడియానికి చేరుకున్నారు.

 షెడ్యూల్ ప్రకారం... సభా ప్రాంగణానికి చంద్రబాబు 12.30కు చేరుకోవాల్సి ఉండగా సరిగ్గా 3 గంటలకు వేదికపైకి చేరుకున్నారు. వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ నూలుతో తయారుచేసిన పూలమాల వేసి స్వాగతం పలికారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top