అన్ని కోణాల్లో దర్యాప్తు, మావోల హస్తం లేదు: డీజీపీ

అన్ని కోణాల్లో దర్యాప్తు, మావోల హస్తం లేదు: డీజీపీ - Sakshi


నల్లగొండ: నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌ ఘటనాస్థలిని డీజీపీ అనురాగ్‌శర్మ గురువారం పరిశీలించారు. స్థానిక అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ సాధారణ తనిఖీల్లో భాగంగానే బస్టాండ్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారని తెలిపారు.  బస్సులో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు అనుమానితులుగా కనిపించటంతో వారిని ప్రశ్నిస్తున్న సమయంలో ఈ కాల్పులు జరిగాయన్నారు. దుండగులు వాడిని తూటాలను బట్టి, ఏపీ, బీహార్కు చెందిన ముఠా సభ్యులుగా అనుమానిస్తున్నామన్నారు.



7.65 బుల్లెట్లను ఉత్తర భారతంలో కొన్ని ముఠాలు నాటు తుపాకుల్లో వాడుతుంటాయని అనురాగ్ శర్మ తెలిపారు. కాల్పులు జరిపిన ముఠాను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని, ఈ కాల్పుల వెనుక మావోయిస్టుల హస్తం ఉందనుకోవటం లేదని అనురాగ్ శర్మ తెలిపారు. అలాగే చనిపోయిన పోలీసుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఐ మొగులయ్య కోలుకుంటున్నారని తెలిపారు.


ఈ ముఠా...పోలీసులపై కాల్పులు జరిపిన పారిపోతూ అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి హైదరాబాద్ వెళుతున్న జెడ్పీటీసీ దొరబాబు వాహనంపై కూడా కాల్పులకు పాల్పడినట్లు డీజీపీ తెలిపారు.  ఆయన భుజంలోకి తూటా దూసుకు  వెళ్లిందని ప్రస్తుతం  హైదరాబాద్ లో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top