నిద్రపోతామంటే కుదరదు

నిద్రపోతామంటే కుదరదు - Sakshi


15 రోజుల్లో నివేదికలు సిద్ధం చేయాలి

నిజాయితీతో కష్టపడి పని చేయాలి

నగరాన్ని అభివృద్ధి పథంలో నిలపాలి

జీవో 58కి సవరణలు అవసరం

{Vేటర్ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం సమీక్ష


 

హన్మకొండ:  ‘ననిన్టిదాక నిద్రపోయారో.. ఏం చేశారో తెల్వదు. ఇప్పుడు నిద్రపోతామంటే కుదరదు. గతం గతః, నగరాన్ని ఎంతో బాగా అభివృద్ధి చేయాలని సీఎం అనుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగా అందరం పనిచేయూలె’ అని కుడా, కార్పొరేషన్ అధికారులకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నిర్దేశం చేశారు. సీఎం ఇటీవల నగరంలో పర్యటించి ఇచ్చిన హామీల అమలుపై కలెక్టరేట్‌లో డిప్యూటీ సీఎం శనివారం సమీక్ష చేపట్టారు. 15 రోజుల్లో సీఎం హామీల అమలు కోసం పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయూలని ఆదేశించారు.  

 

ఇబ్బంది లేకుండా లేవుట్




జీ ప్లస్ వన్ ఇళ్ల నిర్మాణంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఎంపిక చేసిన తొమ్మిది కాలనీల్లో ప్రస్తుతం ఇళ్లకు నష్టం లేకుండా లే అవుట్లు రూపొందించాలని డిప్యూటీ సీఎం సూచించారు. మురికివాడల్లో ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో దాదాపు రూ. 500 కోట్లు నగరానికే కేటాయించే అవకాశం ఉందన్నారు. జీ ప్లస్ వన్ నిర్మాణాలపై ప్రజల్లో అపోహలు తొలగించాలని కోరారు. నిర్మాణాలకు అంగీకారించిన కాలనీల్లో పనులు ప్రారంభించి.. మిగతా వారిని కూడా ప్రోత్సహించాలని సూచించారు. అదనపు లబ్ధిదారుల ఎంపికకు విధివిధానాలు త్వరలో రూపొందిస్తామన్నారు.

 

జీవో 58కి సవరణలపై చర్చిస్తాం..




నగరంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా జీవో నంబరు 58కు సవరణలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయూన్ని మంత్రివర్గంలో చర్చిస్తానని కడియం పేర్కొన్నారు. ప్రస్తుతం ఎంపిక చేసిన కాలనీల్లో సగానికి పైగా చెరువు శిఖంలోనే ఉన్నాయని, ఈ చెరువు శిఖం భూములకు జీవో నంబరు 58 వర్తించదని స్పష్టంచేశారు. వరంగల్‌లో ఐదు, హన్మకొండలో ఐదు మార్కెట్ల ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని కడియం పేర్కొన్నారు. వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో రూ. 6 కోట్లతో నిర్మించనున్న రెండు షాదీఖానాలకు స్థలాన్ని ఎంపిక చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. దేశాయిపేట, బంచరాయి ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించాలన్నారు.  



పై నుంచి దిగొచ్చారా!



నగరంలోని వీధుల్లో చెత్త పేరుకపోవడంపై కడియం ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కుమార్‌పల్లి మార్కెట్ ఏరియాలోకి ఒక్కసారి వెళ్తే చాలు.. పారిశుద్ధ్య విభాగం సిబ్బందిని సస్పెండ్ చేయాడానికి’ అంటూ మండిపడ్డారు. కార్పొరేషన్‌లో పాలన ఇష్టారాజ్యంగా మారడాన్ని ప్రస్తావిస్తూ.. ‘మీరు ప్రభుత్వ ఉద్యోగులా.. లేకుంటే పై నుంచి దిగివచ్చారా? పని చేయని అధికారులను పంపించేస్తాం’ అని హెచ్చరించారు. 15 రోజుల్లో రోడ్లపై చెత్త లేకుండా చూడాలని, లేకుంటే సిబ్బందిని మార్చాల్సి వస్తుందని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో మాదిరిగా వరంగల్‌లో ఎల్‌ఈడీ లైట్లు, ఆర్‌వో ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు కార్పొరేషన్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నగరంలోని చెరువులను గుర్తించి, రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. నిర్మాణం పూర్తై ఇండోర్ స్టేడియాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు.  



రోడ్లను విస్తరించాలి



హంటర్‌రోడ్డు-నిట్, కాజీపేట-పెద్దమ్మగడ్డ, కడిపికొండ-ఉర్సుగుట్ట, రాంపూర్-ధర్మారం, పెట్రోల్‌పంప్-హసన్‌పర్తి, పోచమ్మమైదాన్-వరంగల్ తదితర రోడ్లను సాధ్యమైనంత త్వరగా విస్తరించాలని కడియం సూచించారు.  హంటర్‌రోడ్డు-నిట్‌రోడ్డుకు శాయంపేట వద్ద భూ సేకరణ చేయాల్సి ఉందని పేర్కొన్నారు.



కలెక్టరేట్ సమీపంలో ప్రణయ్‌మార్గ్‌లో ఉన్న వై జంక్షన్ వద్ద పరిస్థితిని పదిహేను రోజు ల్లో సరిచేయూలన్నారు. అంతకుముందు సీఎం హామీలు.. నగర అభివృద్ధికి సంబంధించిన వివరాలను కలెక్టర్ కరుణ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. రెండు విలీనగ్రామాల ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి టి. రాజయ్య ఈ సమావేశానికి హాజరుకాలేదు.

 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top