అడ్డులేని అక్రమ కట్టడాలు..!

అడ్డులేని అక్రమ కట్టడాలు..! - Sakshi


ఇబ్రహీంపట్నం: పట్నం నగర పంచాయతీ పరిస్థితి అధ్వానంగా మారింది. ఇక్కడ అక్రమ నిర్మాణాల జోరు ఓ రేంజ్‌లో సాగుతోంది. అడిగే వారు లేకనో.. లేదా అడుగకుండా ‘మేనేజ్’ చేస్తున్నారో తెలియదుకానీ.. అక్రమ నిర్మాణల తంతు ప్రమాదకరస్థారుుకి చేరింది.

 

ప్రమాదం జరిగాక స్పందిస్తారేమో..?


ఇటీవలే పట్నంలో భూముల రేట్లు ఆకాశాన్నంటడంతో నిర్మాణాలు కూడా అదే దిశగా సాగుతున్నాయి. ఓవైపు పాతాళంలోకి సెల్లార్లు.. వురోవైపు నింగినంటేలా ఐదు, ఆరు అంతస్తుల నిర్మాణాలు ఇప్పుడు ఇక్కడ సర్వసాధారణమైపోయాయి. పట్నంలోని త్రిశక్తినగర్‌లో ఓ భవింతి నిర్మాణంలో భాగంగా సెల్లార్ కోసం భారీ స్థాయిలో తవ్వకాలు చేపట్టారు.

 

ఇక్కడి భూమి సెల్లార్ నిర్మాణానికి ఎంతవరకు అనువైంది, ఆ తర్వాత బిల్డింగ్ నిర్మిస్తే ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఇంతలోతుగా తవ్వకాలు జరిపితే చుట్టూ ఉన్న నిర్మాణాలపై ప్రభావం ఏమేర ఉంటుంది అనే విషయూలను పట్టించుకోకుండా పనులు చకచకా కానిస్తున్నారు. అయితే అధికారులు వూత్రం ఈ నిర్మాణం గురించి ఏవూత్రం పట్టించుకోకపోవడంపై స్థానికులు ప లు అనువూనాలు వ్యక్తం చేస్తున్నారు.

 

దిక్కుమొక్కులేని టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ...

పట్టణ ప్రణాళిక విభాగంలో ఒక్క అధికారి కూడా లేకపోవడంతో పట్నంలో అక్రమ నిర్మాణాలు యుథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఇక్కడ అనువుతులు తీసుకొని నిర్మాణాలు చేపట్టాలన్నా కూడా.. ఏ ఒక్క అధికారి కూడా అందుబాటులో ఉండటం లేదు.  

 

క్షేత్రస్థాయిలో నిర్మాణాల పరిశీలన, అనుమతులు అందజేసే పరిస్థితులు ఇక్కడ దరిదాపుల్లో కూడా కనిపించండంలేదు. ఇక అక్రమ నిర్మాణాలపై అధికారులు పర్యవేక్షణ దేవుడెరుగు.. స్థానికులు వెళ్లి ఫిర్యాదు చేసినా ఆలకించే వారు కరువయ్యూరు. నగర పంచాయతీలో టౌన్‌ప్లానింగ్ విభాగం పూర్తిగా నిర్వీర్యంగా వూరడంతో పంచాయతీ ఆదాయూనికి కూడా గండిపడుతోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top