‘దీపం’ దోపిడీ

‘దీపం’ దోపిడీ - Sakshi


* పేదింట్లో వెలగని దీపం

* కనెక్షన్‌కు రూ.1200

* స్టౌ ఖరీదు రూ.2000

* ముందుకు రాని లబ్ధిదారులు


సిరిసిల్ల : ‘దీపం’ పేదింట్లో వెలుగులు నింపడంలేదు. పేదలకు సబ్సిడీపై దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకొచ్చినా ఏజెన్సీ నిర్వాహకులు దోపిడీ పర్వానికి తెరలేపుతున్నారు. సిలిండర్‌కు స్టౌ లింక్ పెట్టి అడ్డగోలు వసూళ్లు చేస్తూ లబ్ధిదారులపై అదనపు భారం మోపుతున్నారు.



దీంతో దీపం కనెక్షన్ తీసుకునేందుకు పేదలు ముందుకు రావడంలేదు. ప్రభుత్వం జిల్లాకు మొదటి విడతగా 65 వేల దీపం కనెక్షన్లు మంజూరు చేసింది. జిల్లా పౌరసరఫరాల అధికారులు 55 వేల కనెక్షన్లను జిల్లాలోని అన్ని మండలాలు, మున్సిపాలిటీలకు కేటాయించారు. ఇప్పటివరకు 30,820 కనెక్షన్లు మాత్రమే మహిళలు పొందగా.. 24,180 కనెక్షన్లు మిగిలిపోయూరుు. దీనికి అదనంగా మరో 30 వేల కనెక్షన్లు కేటారుుంచడంతో వాటిని ఎవరికి పంపిణీ చేయూలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.  

 

స్టౌ లింక్‌తో వసూలు

బహిరంగ మార్కెట్‌లో ఐఎస్‌ఐ మార్క్ కలిగిన గ్యాస్‌స్టౌ ఖరీదు రూ.800 నుంచి రూ.1200 వరకు ఉంది. ఇదే స్టౌను గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు రూ.2వేలకు అంటగడుతున్నారు. ఫలితంగా పేదలైన లబ్ధిదారులు రూ.3వేలు చెల్లిస్తేనే ఇంట్లో దీపం వెలిగే అవకాశముంది. గ్యాస్ ఏజెన్సీల మధ్య పోటీ ఉండడంతో ఆఫర్లు ఇచ్చి మరి రూ.2500 సిలిండర్, స్టౌ, రెగ్యులేటర్, పైపును దీపం పథకంతో సంబంధం లేకుండా నేరుగా ఇస్తున్నారు.



ఇలాంటి పరిస్థితుల్లో దీపం కనెక్షన్‌పై పేదలు ఆసక్తి చూపడం లేదు. సిరిసిల్ల మండలానికి 1711 దీపం సిలిండర్లు మంజూరీ కాగా.. 1,014 మందికి మంజూరు చేస్తూ ఎంపీడీవో ప్రొసీడింగ్‌లు ఇచ్చారు. ఇందులో 566 మంది మాత్రమే సిలిండర్లు తీసుకున్నారు. ఇటీవల మరో 1,729 సిలిండర్లు మంజూరయ్యాయి. వీటిని పంపిణీ చేద్దామంటే అర్హులైన పేదలెవరూ ముందుకు రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.

 

స్టౌ అడిగితేనే ఇస్తున్నాం..

దీపం కనెక్షన్లకు స్టౌను అడిగితేనే ఇస్తున్నాం. ఎవరికీ బలవంతంగా ఇవ్వడం లేదు. ఐఎస్‌ఐ మార్క్ కలిగిన స్టౌ కొనుగోలు చేసినట్లు అంగీకారపత్రం తీసుకోవాలని డీలర్ల సంఘం చెప్పింది. ఆ మేరకే వినియోగదారుల నుంచి పత్రం తీసుకుంటున్నాం. అదనపు డబ్బులు తీసుకోవడం లేదు.

- గడ్డం ప్రమీల, గ్యాస్ ఏజెన్సీ డీలర్

 

ఆసక్తి చూపడం లేదు..

దీపం కనెక్షన్లపై ఆసక్తి తగ్గిపోయింది. మంజూరు పత్రాలు ఇచ్చినా తీసుకెళ్లేందుకు ముందుకు రావడంలేదు. స్టౌ నిబంధనతో కొంత ఇబ్బందిగా ఉంది. ఇదివరకే కొంతమందికి కనెక్షన్ ఉన్నాయి. స్టౌ తీసుకోవాలనే నిబంధనను తొలగించాలి.  

 - మదన్‌మోహన్, ఎంపీడీవో సిరిసిల్ల

 

స్టౌ ఉన్నట్లు బిల్లు చూపితే చాలు..


జిల్లావ్యాప్తంగా దీపం కనెక్షన్ల మంజూరీ ప త్రాలు ఇచ్చాం. చాలామంది తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. మళ్లీ కొత్త కనెక్షన్లు మంజూ రయ్యాయి. గ్యాస్ ఏజెన్సీలోనే స్టౌ కొనాలి అనే నిబంధన లేదు. స్టౌ ఉన్నట్లు బిల్లు చూపిస్తే చాలు.     - చంద్రప్రకాశ్, డీఎస్‌వో

Election 2024

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top