కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ వాళ్లే నిలదీయాలి


లేదంటే ఎమ్మెల్యేలను తిరగనివ్వబోం..

టీఆర్‌ఎస్‌ది అంతా ఎన్నికల జిమ్మిక్కులే..

అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా..

జూన్ 2న ఘనంగా తెలంగాణ సంబరాలు

డీసీసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి


 

 సాక్షి ప్రతినిధి, వరంగల్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఏమార్చుతున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ లు అమలు చేయని కేసీఆర్‌ను టీఆర్‌ఎస్ జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులే నిలదీయాలని సూచించారు. హన్మకొండలోని కాంగ్రెస్ భవన్‌లో నాయిని రాజేందర్‌రెడ్డి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.



సీఎం మాటల గారడీతో తెలంగాణ ప్రజలను మరోసారి బు రిడీ కొట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శిం చారు. ‘ఎన్నికల ముందు నగరంలో అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ నిర్మిస్తానని.. సీఎం అయ్యాక కాళోజీ కళా కేంద్రం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని, జిల్లాను అభివృద్ధి చేస్తానని జిల్లాకు వచ్చిన ఐదు సందర్భాల్లో ఆర్భాటంగా ప్రకటించారు. ఆరు నెలలు దాటిన మట్టిపెల్ల తీయలేదు.  టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో జిల్లాకు జరిగిన అన్యాయంపై ఆ పార్టీకి చెందిన జిల్లా నాయకులే కేసీఆర్‌ను నిలదీయాలి.



ఈ విషయంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పందించకుంటే వారిని గ్రామాల్లో తిరగనివ్వబోం. ఎన్నికల ముందు కేసీఆర్ ఇచ్చిన వాగ్ధానాలు సీడీలో పొందుపరిచి ప్రతి గ్రామ, మండల, పట్టణాలలో పంపిణీ చేస్తాం. ప్రజల సహకారంతో హామీల అమలు కోసం ఆందోళనలు చేస్తాం. అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమా’ అని నాయిని సవాల్ విసిరారు.



 కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలు

 జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని కాం గ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యా ప్తంగా వాడవాడలా సోనియాగాంధీ ప్లెక్సీలు, కాం గ్రెస్ తోరణాలతో సంబరాలు జరపాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ‘తెలంగాణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,200 మంది అమరులైతే కేవలం 200 మంది పేర్లనే ప్రకటించి అమరుల త్యాగాలను అవమానపరిచారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడిన భూపతి కృష్ణమూర్తి మరణాంతరం ఆయన కుటుం బం దుస్థితిలో ఉన్నా పట్టించుకోవడం లేదు. 



టీఆర్‌ఎస్ చేరాలని కాంగ్రెస్ నాయకులను బెదిరిస్తున్నారు. అందులో భాగంగా కొందరు అధికార పార్టీ వారు.. కాంగ్రెస్ నాయకుల, కార్యకర్తల పేర్ల జాబి తాలు పోలీస్‌స్టేషన్లకు పంపించి ఏదో ఒక కేసులో వారిపై రౌడీషీట్లు తెరవాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ విషయంలో మాకు స్పష్టమైన సమాచారం ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తే కొందరు టీఆర్‌ఎస్ నాయకులు ఫొ టోలకు ఫోజులిచ్చారు. డిసెంబర్‌లో కాకతీయ ఉత్సవాలను జాతీయస్థాయిలో నిర్వహిస్తామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు.



మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలో లబ్ధి కోసమే స్వచ్ఛ హైద్రాబాద్ చేపట్టిన కేసీఆర్.. స్వచ్ఛ వరంగల్‌ను చేపడతామని చెప్పడం ఎన్నికల వ్యూహంలో భాగమే’ అని రాజేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, మాజీ ఎమ్మేల్యే కొండేటి శ్రీధర్, నాయకులు ఈవీ శ్రీనివాసరావు, కోన శ్రీకర్ సమావేశంలో పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top