దళితుల చేతిలో జెండానవుతా


  •       డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య

  •      జనగామలో అభినందన సభ

  • జనగామ : దళితుల చేతిలో జెండానై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య అన్నారు. బుధవారం స్థానిక ఉనృపుర బాప్టిస్ట్ చర్చి ఆవరణలో దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో డాక్టర్ సుగుణాకర్‌రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్య, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మను సన్మానించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజ య్య మాట్లాడుతూ త్యాగం, తెగింపు దళితుల రక్తంలో దాగి ఉందన్నారు.



    తెగింపు.. కసితో ఆనాడు బీఆర్ అంబేద్కర్ ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావుల్లో ఒకరయ్యారని, అందుకే ఆయనకు రాజ్యాంగాన్ని రచిం చే అవకాశం వచ్చిందని చెప్పారు. అంబేద్కర్ అందించి న ఫలాలతో నేడు దళితులు అన్ని విధాల ఎదుగుతున్నారని పేర్కొన్నారు. దళితులపై ఎవరైనా దాడులకు దిగితే ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దళితుల పక్షపాతి కేసీఆర్ అని, లక్ష కోట్ల ప్రణాళికలో దళితులకే రూ. 50వేల కోట్ల నిధులు వెచ్చించనున్నారని తెలిపారు.  



    వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచిన పింఛన్లను వచ్చే దసరా నుంచి అందించనున్నట్లు వివరించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల ప్రజాసేవ అనే కాలేజీలో ప్రస్తుతం అడ్మిషన్ మాత్రమే లభించిందని.. పరీక్ష పాసయ్యాకే తనకు సన్మానం చేయాలని.. ఇప్పుడు వద్దని అన్నారు. తెలంగాణను అన్ని విధాల ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని తెలి పారు. నియోజకవర్గంలోని కమ్యూనిటీ హాల్‌లను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

     

    భావోద్వేగానికి లోనైన జెడ్పీ చైర్‌పర్సన్

     

    కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. డిప్యూటీ సీఎం రాజయ్య, ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్, ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి కృషి, అంబేద్కర్ అందించిన రాజ్యాంగ ఫలాలతో తనకు పదవి వచ్చింద న్నారు. ఒక పేదింటి బిడ్డను ఈ స్థాయికి తెచ్చిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.



    కార్యక్రమంలో ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు, మున్సిపల్ చైర్‌పర్సన్ గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, వైస్‌చైర్మన్ నాగార పు వెంకటేష్, పాస్టర్లు రెవరెండ్ ఫిలిప్, నర్సింగరావు, ఓజెస్, చర్చి అధ్యక్షుడు మంతపురి ప్రకాష్, దళిత గిరిజ న క్రైస్తవ సంఘాల సమాఖ్య నాయకులు, కౌన్సిలర్లు డాక్టర్ రాజమౌళి, పసుల ఏబెల్, ఎన్.శ్రీరాములు, మేడ శ్రీనివాస్, దేవర ఎల్లయ్య, కన్నారపు ఉపేందర్, బొట్ల నర్సింగరావు, ఉడుగుల రమేష్, బొట్ల పెద్దశ్రీనివాస్, రాజమౌళి, గిరిమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top