అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు


 మహబూబ్‌నగర్ టౌన్:  ప్రభుత్వ సరుకులు లబ్ధిదారులకు పంపిణీ చేయకుండా అక్రమాలకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జేసీ ఎల్.శర్మన్ హెచ్చరించారు. శుక్రవారం తన చాంబర్‌లో 6ఏ కేసులకు సంబంధించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో తేలితే సహించేది లేదని చెప్పారు. అక్రమాలను అరికట్టేందుకు దాడులు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లతో అక్రమ దందాలను పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని చెప్పారు.



 27 కేసులు పరిష్కారం

 6ఏకు సంబంధించి నమోదైన 41 కేసులపై జేసీ విచారణ చేసి, వాదోపవాదనలు విని 27 కేసులు పరిష్కరిస్తూ జడ్జిమెంట్ ఉత్తర్వుల కోసం రిజర్వ్ ఫర్ ఆర్డర్‌లో పెట్టారు. వీటికి సంబంధించి నెల రోజుల్లో ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు తెలిపారు. పరిష్కరించిన వాటిలో రేషన్‌షాపులకు సంబంధించి 10 కేసులకు 7, ఎల్ పీజీ 4 కేసులకు 3, ట్రేడర్స్‌కు సంబంధించి 26 కేసులకు 16,  రైస్‌మిల్లర్స్‌కు సంబంధించి ఒక కేసును పరిష్కరించారు. కార్యక్రమంలో సీని యర్ అసిస్టెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.



 కమ్యూనికేషన్ కోసం సెల్‌ఫోన్లు

 కమ్యూనికేషన్ అందించాలన్న ఉద్దేశంతో హాస్టల్ వెల్ఫేర్ అధికారులకు సెల్‌ఫోన్లను అందజేస్తున్నట్లు జేసీ ఎల్.శర్మన్ వెల్లడించారు. శుక్రవారం తన చాంబర్‌లో  52 మందికి సెల్‌ఫోన్ల టెండర్లను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకనుగుణంగా ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నామన్నారు. కమ్యూనికేషన్‌ను సద్వినియోగం చేసుకుని రాణించాల్సిందిగా సూచించారు. ఒక్కో సెల్‌ఫోన్‌కు రూ. 6,990ధరను ప్రభుత్వం నిర్ణయించగా ముగ్గురు టెండర్ దారులు పాల్గొన్నారు. వీరిలో ఒకరు రూ.10 తక్కువ కోడ్ చేసి టెండర్ దక్కించుకున్నారు.  



 నాణ్యమైన సామాగ్రి అందజేయూలి

 వసతి గృహాలకు సామాగ్రి సరఫరా చేసే టెండర్లు దక్కించుకున్న వారు నాణ్యమైన వాటినే సరఫరా చేయూలని జారుుంట్  కలెక్టర్ ఎల్.శర్మన్ టెండర్‌దారులను ఆదేశించారు. జిల్లాలోని 102సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లకు వంట సామాగ్రి సరఫరా చేసేందుకు శుక్రవారం తన చాంబర్‌లో టెండర్లు నిర్వహించారు. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే తక్కువ కోట్ చేసి టెండర్లను దక్కించుకున్న వారంతా నష్టం వచ్చిందనే సాకుతో మధ్యలో వదిలేసిన సంఘటనలు చాలా ఉన్నాయన్నారు.



ఇకపై అలాచేస్తే వారిపై కఠిన చర్యలతోపాటు, డిపాజిట్లను తిరిగి ఇవ్వబోమన్నారు. వీరిపై ప్రత్యే నిఘా  ఏర్పాటు చెయ్యాల్సిందిగా అధికారులను ఆదేశించారు. టెండర్లు నిర్వహించిన వాటిలో ట్రంక్‌పెట్టెలు, జామంట్రీ, డ్రా బాక్సులు, రిజిస్టర్లు తదితరులు ఉన్నారుు. కార్యక్రమంలో సోషల్ వెల్ఫేర్ డిడి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top