ముగిసిన క్రికెట్ సంబురం

ముగిసిన క్రికెట్ సంబురం - Sakshi


ఐదు రోజులు పాటు పాలమూరులో జరిగిన   క్రికెట్ సంబురం శుక్రవారం ముగిసింది. తుది సమరంలో ఉత్తరప్రదేశ్ 41పరుగుల తేడాతో చంఢీగడ్‌ను చిత్తు చేసి టైటిల్‌ను సొంతం చేసుకుంది. టోర్నీ ఫేవరెట్ ఢిల్లీ మూడోస్థానంలో నిలిచింది. ఎన్నో ఆశలతో బరిలోకి దిగిన తెలంగాణ జట్టు సెమీస్‌లో ఓడి, నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

 

 మహబూబ్‌నగర్ క్రీడలు: క్రికెట్‌లో నైపుణ్యం సాధించి భవిష్యత్తులో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని అడిషనల్ ఎస్పీ మల్లారెడ్డి ఆకాంక్షించారు. జిల్లా కేంద్రంలో ఐదు రోజులుగా నిర్వహించిన జాతీయ క్రికెట్ టోర్నీ శుక్రవారం ముగిసింది. జిల్లా స్టేడియంలో సాయంత్రం జరిగిన బహుమతి ప్రదానోత్సవానికి ఏఎస్‌పీ మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మొదటిసారిగా జిల్లాలో జాతీయ క్రికెట్ టోర్నీని విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. టోర్నీలో క్రీడాకారులు క్రీడాస్ఫూర్తిని చాటారని చెప్పారు. ధోని, సురేష్‌రైనా లాంటి క్రీడాకారులు మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చారని, వారిని స్ఫూర్తిగా తీసుకొని రాణించాలని కోరారు.

 

 గెలుపు, ఓటములను సమానంగా స్వీకరించాలని, ఓడినవారు నిరాశకు గురికాకుండా విజయం కోసం ప్రయత్నిస్తూ ఉండాలన్నారు. అనంతరం హిందీలో ప్రసంగించి ఇతర రాష్ట్రాల క్రీడాకారులను ఉత్తేజపరిచారు. అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు శాంతికుమార్ మాట్లాడుతూ టోర్నీ నిర్వహణకు జిల్లా పెట్టింది పేరు అన్నారు. జిల్లాలో క్రీడాభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానన్నారు. ఎస్‌జీఎఫ్ తెలంగాణ కోఆర్డినేటర్ విజయరావు మాట్లాడుతూ ఎస్‌జీఎఫ్‌ఐ కేంద్రం వారు తెలంగాణకు జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ ఇస్తామని చెబితే మొదట మహబూబ్‌నగర్ జిల్లానే గుర్తుకు వచ్చిందన్నారు.

 

 అందరి సహకారంతో టోర్నీలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించారని అన్నారు. అనంతరం విజేత ఉత్తరప్రదేశ్, రన్నరప్ చంఢీగఢ్, మూడోస్థానం ఢిల్లీకి పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏజేసీ రాజారాం, టోర్నీ పరిశీలకుడు పాఠక్, జేపీఈఎన్‌సీ అధినేత కేఎస్ రవికుమార్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి సురేష్‌కుమార్, ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, రిటైర్డ్ పీడీలు మహ్మద్ అలీ, చెన్నవీరయ్య, ఆర్గనైజింగ్ కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

 జాతీయస్థాయి అండర్-14 స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ టోర్నీ టైటిల్‌ను ఉత్తరప్రదేశ్ కైవసం చేసుకుంది. ఫైనల్లో ఆ జట్టు చంఢీగడ్‌ఫై 41 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ మూడోస్థానంతో సరిపెట్టుకోగా...ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలంగాణ జట్టు సెమీస్‌లోనే వెనుదిరిగి నాలుగోస్థానంలో నిలిచింది.

 - మహబూబ్‌నగర్ క్రీడలు

 

 భారీ విజయం

 ఉత్తరప్రదేశ్ జట్టు తుది సమరంలో అద్భుతంగా ఆడి టైటిల్ సొంతం చేసుకుంది. చంఢీగడ్‌తో జరిగిన ఫైనల్లో ఆ జట్టు 41 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. జిల్లాస్టేడియంలో మధ్యాహ్నం జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఉత్తరప్రదేశ్ 15ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 149పరుగులు చేసింది. సౌరభ్ శ్రీవాస్తవ్ 53 నాటౌట్ (29 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్) మెరుపు వేగంతో బ్యాటింగ్ చేసి, అర్ధసెంచరీ సాధించాడు. అతనికి అండగా భాస్కర్ (47: 30 బంతుల్లో ఏడు ఫోర్లు, 1సిక్స్), అబ్దుర్ రహెమాన్(32: 23 బంతుల్లో ఏడు ఫోర్లు) రాణించడంతో యూపీ భారీ స్కోరు నమోదు చేసింది.

 

 ఓవర్‌కు 10రన్‌రేట్‌తో కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన చంఢీగడ్ ఆరంభంలోనే తడబడింది. ఓపెనర్ సూర్యనారాయణ 15బంతుల్లో 27 (5 ఫోర్లు) మెరుపు బ్యాటింగ్ చేయగా, నిపున్(26) రాణించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్ త్వరగా ఔట్ కావడంతో ఆ జట్టు14 ఓవర్లలో 108పరుగులకు కుప్పకూలింది. యూపీ బౌలర్లలో సౌరభ్ శ్రీవాస్తవ్ 3, సౌరభ్‌వర్మ, భాస్కర్ 2వికెట్లు తీసుకున్నారు.

 

 స్కోరుబోర్డు

 ఉత్తరప్రదేశ్: అబ్దుర్ రహెమాన్ (సి)షక్సమ్ (బి) సార్థక్ 32, ఆకాష్‌సింగ్ (సి) ప్రశ్ (బి) అమిత్ 0, భాస్కర్ (సి) ప్రశ్ (బి) షక్సమ్ 47, సౌరభ్‌శ్రీవాస్తవ్ 53 నాటౌట్, యశ్‌వేంద్ర 8 నాటౌట్, ఎక్స్‌ట్రాలు 9 (వైడ్లు 7, బైస్ 2), మొత్తం: (15 ఓవర్లు) 149/3 బౌలింగ్: ఆర్యన్ 1-0-16-0, అమిత్ 3-0-26-1, అర్జున్ 1-0-9-1, సార్థక్ 3-0-16-1, అతుల్ 3-0-29-0, నిపున్ 3-0-21-0, షక్సమ్ 2-0-30-1. చంఢీగడ్: సూర్యనారాయణ (స్టంప్డ్) అభినవ్ (బి) సౌరభ్‌వర్మ 27, గౌరవ్‌దీప్ (స్టంప్డ్) అభినవ్ (బి) సౌరభ్ యాదవ్ 6, నిపున్ (రనౌట్) 26, సార్థక్ (బి) భాస్కర్ 5, అమిత్ (స్టంప్డ్) అభినవ్ (బి) సౌరభ్ శ్రీవాస్తవ్ 18, కుష్‌నిన్ (స్టంప్డ్) అభినవ్ (బి) ఆకాష్ 7, అతుల్ (సి) ప్రిన్స్ (బి) సౌరభ్ శ్రీవాస్తవ్ 1, ప్రభసిమ్మన్ (సి) ప్రిన్స్ (బి) సౌరభ్ శ్రీవాస్తవ్ 1, షక్సమ్ నాటౌట్ 1, ఆర్యన్ (రనౌట్) 0, అర్జున్ (సి) అన్వర్ (బి) సౌరభ్‌వర్మ 6, ఎక్స్‌ట్రాలు 10 (వైడ్లు 6, బైస్ 3, నోబ్1), మొత్తం (14 ఓవర్లలో) 108 ఆలౌట్ బౌలింగ్: సౌరభ్‌యాదవ్ 2-0-15-1, సౌరభ్ శ్రీవాస్తవ్ 3-1-6-3, అంకూర్ 2-0-17-0, సౌరభ్‌వర్మ 3-0-30-2, ఆకాష్‌సింగ్ 2-0-24-1, భాస్కర్ 2-0-13-1

 

 అం‘ఫైరింగ్’

 మహబూబ్‌నగర్ క్రీడలు:

 జిల్లా స్టేడియంలో జరిగిన తెలంగాణ-ఉత్తరప్రదేశ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాకరి ఆరోపిస్తూ మ్యాచ్ ముగిసిన వెంటనే ప్రేక్షకులు ఆందోళన నిర్వహించారు. యూపీ గెలిచిన వెంటనే మైదానంలోకి దూసుకెళ్లి అంపైర్లతో వాగ్వివాదానికి దిగారు. యూపీ జట్టుకు అనుకూలంగా వ్యవహరించారని, తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రేక్షకులందరూ ఒక్కసారిగా అంపైర్ల వద్దకు వెళ్లడంతో ఎస్‌జీఎఫ్ నిర్వాహకులు, ఇతర అధికారులు అంపైర్లను వేదిక వద్దకు తీసుకొచ్చారు. అక్కడికీ వచ్చిన ప్రేక్షకులు అంపైర్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ఓపెనర్ హిమతేజ రనౌట్ కాదని, కొన్ని వైడ్‌లను కూడా ఇవ్వలేదని వారు ఆరోపించారు. తెలంగాణ ఎస్‌జీఎఫ్ కోఆర్డినేటర్ విజయరావుతోపాటు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తదితరులు ప్రేక్షకులను సముదాయించారు. అంపైర్ల నిర్ణయానికి కట్టుబడాలని, క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేయడంతో ప్రేక్షకులు శాంతించారు.

 

 ఫీల్డింగ్ నిర్లక్ష్యం... ముంచిన రనౌట్లు  

 క్వార్టర్‌ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఎన్‌వీఎస్‌పై సంచలన విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరిన తెలంగాణ అనవసర తప్పిదాలతో చేజేతులారా ఫైనల్ బెర్తును కోల్పోయింది. క్వార్టర్‌‌సలో అద్భుతంగా ఫీల్డింగ్ చేసినా... సెమీస్‌లో చేతులెత్తేశారు. తెలంగాణ ప్రధాన బౌలర్లు ఆదిత్య, విశాల్ ధారళంగా పరుగులు సమర్పించుకోవడంతో యూపీ ఓపెనర్లు 88 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. బౌండరీల వద్ద ఫీల్డింగ్ తేలిపోయింది. ఒక్క పరుగు వద్ద రెండు పరుగులు సమర్పించుకున్నారు. కళ్లముందు భారీ లక్ష్యం ఉన్నా తెలంగాణ బ్యాట్స్‌మన్ జోరు చూపించలేదు. టోర్నీలో ప్రధాన ఆకర్షణగా ఉన్న హిమతేజ, చంద్రశేఖర్, సుమంత్ కీలకసమయంలో రనౌట్ కావడం, ఆదుకుంటాడనుకున్న విశాల్ భారీషాట్లతో ఒత్తిడిలో వెనుదిరగడంతో తెలంగాణ మ్యాచ్‌ను కోల్పోయింది.

 

 నాలుగో స్థానంలో తెలంగాణ

 ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన 3, 4 స్థానానికి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఆరు వికెట్ల తేడాతో తెలంగాణపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన తెలంగాణ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది. ఓపెనర్లు హిమతేజ 24 బంతుల్లో 4 ఫోర్లతో 25, హర్షవర్ధన్ 29 బంతుల్లో 2 ఫోర్లతో 22 మంచి శుభారంభం ఇచ్చారు.

 

 ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో స్కోరు 91/8కే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లలో రోనాక్, వివేక్‌యాదవ్, షర్వంత్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం 92పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆడుతూపాడుతూ గెలుపొందింది. ఆ జట్టులో వివేక్‌యాదవ్ 29 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్స్‌తో 39 పరుగులు, సుమిత్ 17 బంతుల్లో మూడు ఫోర్లు, సిక్స్‌తో 20పరుగులు చేసి రాణించారు. తెలంగాణ బౌలర్ ఆదిత్య రెండు వికెట్లు తీసుకున్నాడు.

 

 సంక్షిప్త స్కోర్లు

 తెలంగాణ: 91/8 (15ఓవర్లు), హిమతేజ 25, హర్షవర్దన్ 22, రుత్విక్‌రెడ్డి 15, రోనాక్ 2/12, వివేక్‌యాదవ్ 2/17, షర్వంత్2/21: ఢిల్లీ: 95/4 (12.2 ఓవర్లు), వివేక్‌యాదవ్ 39, సుమిత్ 20, ఆదిత్య 2/19

 

 

 సహకరించిన  అందరికీ కృతజ్ఞతలు

 మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లా కేంద్రంలో జాతీయ క్రికెట్ టోర్నీ నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని, అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహించామని టోర్నీ ఆర్గనైజర్, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి సురేశ్‌కుమార్ తెలిపారు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ఉన్నతాధికారులు, విధులు నిర్వర్తించిన అన్ని ఆర్గనైజింగ్ కమిటీల ప్రతినిధులు, క్రీడాకారులకు రవాణా సౌకర్యం కల్పించిన కళాశాలలు, పాఠశాలల యాజమాన్యాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో భవిష్యత్తులో జిల్లాలో మరిన్ని టోర్నీలను విజయవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.  

 

 తలకెక్కిన అభిమానం

 ప్రపంచకప్‌లో టీమిండియా  జయకేతం ఎగరవేసి మరోసారి చాంపియన్‌గా నిలవాలని కోరుతూ పెద్దమందడికి చెందిన మన్యంకొండ తన తల వెనకభాగంలో ప్రపంచ కప్ చిత్రాన్ని గీయించుకుని త న అభిమానాన్ని చాటుకున్నాడు. శుక్రవారం ఆయన జాతీయజెండాతో గ్రామంలో ప్రదర్శన నిర్వహించాడు.          

 - పెద్దమందడి  

 

 సెమీస్‌లో తెలంగాణ ఔట్

 మహబూబ్‌నగర్ క్రీడలు: ఎన్నో ఆశలతో సెమీఫైనల్లో అడుగెట్టిన తెలంగాణ జట్టుకు ఉత్తరప్రదేశ్ షాకిచ్చింది. జిల్లాస్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 13 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ నిర్ణీత 15ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 126పరుగులు చేసింది. జట్టులో అబ్దుల్ రహెమాన్ 41బంతుల్లో ఆరు ఫోర్లతో 52పరుగులు చేసి రాణించాడు. మరో ఓపెనర్ ఆకాష్‌సింగ్ 25 బంతుల్లో నాలుగు ఫోర్లతో 31 పరుగులు, భాస్కర్ 24, సౌరభ్ శ్రీవాస్తవ్ 13పరుగులు చేశారు. తెలంగాణ బౌలర్లలో పరమేశ్, విశాల్ చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన తెలంగాణ జట్టు మొదట్లో తడబడిన చివరకు పుంజుకుంది. అయితే ఆఖరి ఓవర్‌లో 19పరుగులు చేయాల్సి ఉండగా వరుసగా వికెట్లు పడిపోవడంతో 113పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో విశాల్ యాదవ్ 35బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స్‌లతో 46 పరుగులు చేసి ఒంటరి పోరాటం చే యగా, ఆదిత్య 23 బంతుల్లో రెండు ఫోర్లతో 23 పరుగులతో రాణించాడు. యూపీ బౌలర్లలో శ్రీవాస్తవ్ మూడు, సౌరభ్‌వర్మ 2వికెట్లు తీసుకున్నారు.

 

 స్కోరుబోర్డు

 ఉత్తరప్రదేశ్: అబ్దుల్ రహెమాన్ (సి) హేమంత్ (బి) విశాల్ 52, ఆకాష్ సింగ్ (రనౌట్) 31, భాస్కర్ (స్టంప్డ్) హర్షవర్ధన్ (బి) పరమేశ్ 24, సౌరభ్ శ్రీవాస్తవ్ 13 (నాటౌట్), ఎక్స్‌ట్రాలు 6 , మొత్తం (15 ఓవర్లలో) 126/3. బౌలింగ్: మనోసాత్విక్ 3-0-18-0, పరమేశ్ 3-0-21-1, ఆదిత్య 3-0-31-0, విశాల్ యాదవ్ 3-0-23-1, సుమంత్ 2-0-19-0, హేమంత్ 1-0-13-0 తెలంగాణ : హిమతేజ (రనౌట్) 1, హర్షవర్ధన్ (సి) ప్రిన్స్ (బి) సౌరభ్‌యాదవ్ 5, విశాల్‌యాదవ్ (బి) సౌరభ్‌వర్మ 46, హేమంత్‌పీటర్ (సి)శ్రీవాస్తవ్ (బి) అంకూర్ 11, చంద్రశేఖర్ (రనౌట్) 3, ఆదిత్య (సి) భాస్కర్ (బి)శ్రీవాస్తవ్ 23, శ్రీనికేతన్ (స్టంప్డ్) అభినవ్ (బి) సౌరభ్‌వర్మ 2, సుమంత్ (రనౌట్) 1, మనోసాత్విక్ (స్టంప్డ్) అభినవ్ (బి) శ్రీవాస్తవ్ 0, పరమేశ్ (నాటౌట్)0, వెంకటప్రణయ్ (స్టంప్డ్) అభినవ్ (బి) సౌరభ్ శ్రీవాస్తవ్ 0, ఎక్స్‌ట్రాలు 21, మొత్తం(15 ఓవర్లలో) 113 ఆలౌట్. బౌలింగ్: అంకూర్ 3-0-19-1, సౌరభ్‌యాదవ్ 3-0-22-1, శ్రీవాస్తవ్3-0-19-3, ఆకాష్‌సింగ్ 3-0-26-0, సౌరభ్‌వర్మ 3-0-27-2.

 

 ఢిల్లీకి షాకిచ్చిన చంఢీగడ్

 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఢిల్లీ సెమీస్‌లోనే బోల్తా కొట్టింది. త డబడుతూ సెమీస్‌కు వచ్చిన చ ంఢీగడ్ ఏకంగా ఢిల్లీకి షాకిచ్చింది. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 106పరుగులు చేసింది.

 

  జట్టులో సుమిత్ 31 బంతుల్లో నాలుగు ఫోర్లతో 35 టాప్‌స్కోరర్‌గా నిలవగా, చంద్రనాయక్(26) రాణించాడు. చంఢీగడ్ బౌలర్లలో ఆర్యన్ సార్ధన్, రన్‌సోల్డర్  రెండేసి వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చంఢీగర్ 13.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ సూర్యనారాయణ (69; 53 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపువేగంతో బ్యాటింగ్ చేసి, జట్టును గెలిపించాడు.  

 

 సైడ్‌లైట్స్...

 తెలంగాణ-యూపీ జట్ల సెమీఫైనల్ మ్యాచ్ ఉదయం ఉండడంతో ఆరంభంలో ప్రేక్షకులు తాకిడి తక్కువ కనిపించినప్పటికీ కొద్దిసేపటికి స్టేడియం అంతా నిండిపోయింది. బ్యాండ్ మేళాతో కొంతమంది ప్రేక్షకులు, మోటార్‌సైకిళ్ల హారన్‌లతో మరికొంత మంది తెలంగాణ క్రీడాకారులను ఉత్సాహపరిచారు. సెమీఫైనల్ మ్యాచ్‌కు మహిళలు కూడా అధికసంఖ్యలో హాజరయ్యారు. వారు ఈలలు వేస్తూ స్టేడి యంలో సందడి చేశారు.

 

  తెలంగాణ జట్టు ఓడిపోతుందని చాలా మంది ప్రేక్షకులు బయటికి వెళ్లిపోవడం కనిపించింది.  ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 3, 4 స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ ఓడిపోవడంతో ప్రేక్షకులు తిట్టుకుంటూ వెళ్లారు. జిల్లా స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌లో యూపీ ఓడిపోవాలని స్థానిక ప్రేక్షకులు చంఢీగడ్‌కు సపోర్టు చేశారు.   చివరి రోజు చావుష్ హాస్యభరితంగా కామెంటరీతో ప్రేక్షకులను న వ్వించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top