టిఆర్ఎస్కు సిపిఐ మద్దతు
హైదరాబాద్: మెదక్ లోక్సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికలలో సిపిఐ టిఆర్ఎస్కు మద్దతు పలికింది. ఈ నిర్ణయం మెదక్ ఉప ఎన్నికల వరకేనని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి చెప్పారు.
తమ విషయంలో కాంగ్రెస్ మాట తప్పిందని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై యథావిథిగా ఉద్యమాలు చేస్తామని వెంకట రెడ్డి చెప్పారు.