దంపతుల సజీవ దహనం

దంపతుల సజీవ దహనం - Sakshi


మంత్రాల నెపంతో దారుణానికి పాల్పడింది సొంత తమ్ముళ్లే

విద్యుత్‌ స్తంభానికి కట్టేసి, కిరోసిన్‌ పోసి నిప్పు

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఘటన




సాక్షి, సిద్దిపేట: మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో సొంత అన్న, వదినలనే సజీవ దహనం చేశారు. మతితప్పిన ఉన్మా దంలో మునిగిపోయి వృద్ధులని కూడా చూడ కుండా ఇంట్లోంచి నడి వీధిలోకి లాక్కెళ్లారు.. విద్యుత్‌ స్తంభానికి కట్టేసి అందరూ చూస్తుండగానే కిరోసిన్‌ పోసి నిప్పంటిం చారు. వారిని కాపాడేందుకు ప్రయత్నించిన బాధితుల కుమారుడు, కుమార్తెలపై సైతం కిరోసిన్‌ పోసి నిప్పు పెట్టేందుకు ప్రయత్నిం చారు. ఈ దుర్మార్గానికి కొందరు స్థానికులు కూడా సహకరించారు. గురువారం సాయం త్రం సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బీసీ కాలనీలో ఈ ఘటన జరిగింది.  



ఏడాదిగా అనుమానం..

దుబ్బాకలోని బీసీ కాలనీకి చెందిన కడవెర్గు సుదర్శన్‌ (56), శ్రీనివాసులు, మల్లేశం ముగ్గురూ అన్నదమ్ములు. ఏడాది కింద వారి తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. సుదర్శనే మంత్రాలు చేసి నాన్నను చంపాడని ఇద్దరు తమ్ముళ్లు అనుమానం పెంచుకు న్నా రు. అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య ఘర్షణ మొదలైంది. సొంత తమ్ముళ్లే మం త్రా ల ఆరోపణలు చేస్తుండటంతో.. వారికి స్థాని కులు కూడా తోడయ్యారు. కొద్దిరోజుల్లో అదే కాలనీలో ఒక పసిబిడ్డ మృతి చెందడం, మరొ కరి గేదె చనిపోవడం వంటి వాటికి సుదర్శన్‌ మంత్రాలు చేయడమే కారణమని భావిం చారు.



ఈ క్రమంలో బుధవారం రాత్రి జరిగిన ఓ ఘటనతో అంతా కోపోద్రిక్తులయ్యారు. గురువారం సాయంత్రం శ్రీనివాసులు, మల్లేశం, కొందరు స్థానికులు కలసి సుదర్శన్‌ ను, ఆయన భార్య రాజేశ్వరి (52)ని బల వంతంగా వీధిలోకి ఈడ్చుకొచ్చారు. పశువు లను కట్టేసే ప్లాస్టిక్‌ తాడుతో (పగ్గం) వారిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి.. కిరోసిన్‌ పోసి నిప్పుపెట్టారు. తల్లిదండ్రులను రక్షించుకునేందుకు ప్రయ త్నించిన సుదర్శన్‌ కుమారుడు శ్రీధర్, కుమార్తె రేణు కలను అడ్డుకు న్నారు.



ఓ దశ లో రేణుకపై చిన్నాన్న శ్రీనివాసులు కిరోసిన్‌ పోసి, నిప్పంటించేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకుంది. దీనిపై కొందరు సమాచారం ఇవ్వడంతో కొద్దిసేపటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మంటలు ఆర్పి సుదర్శన్, రాజేశ్వరిలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉం డడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు తరలిస్తుండగా.. రాజే శ్వరి మార్గమ ధ్యం లో మృతి చెం దిం ది. సుదర్శన్‌ హైద రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చేర్చాక కొద్దిసే పటి కి మరణించాడు.



అంతకుముందు..

బుధవారం రాత్రి శ్రీని వాసులు పిచ్చిపట్టిన వాడిలా అరుస్తూ ఊరవతల పంట పొలాల వెంట పరుగెత్తాడు. స్థానికులు వెళ్లి అతడిని ఇంటికి తీసుకువచ్చారు. కానీ శ్రీనివాసులు లేచి సుదర్శన్‌ ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లా డు. దయ్యం ఆ ఇంట్లోంచే తన మీదకు వచ్చిందని, తన అన్న దానిని పంపాడంటూ అరిచాడు. దీంతో కోపోద్రిక్తులైన సోదరులు,  బంధువులు, స్థానికులు కలసి సుదర్శన్‌ను,  రాజేశ్వరిలపై దాడి చేసి విపరీతంగా కొట్టారు. దీంతో సుదర్శన్‌ దం పతులు గురువారం ఉద యం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. స్టేషన్‌లో ఎస్సై లేకపోవడంతో.. హెడ్‌ కాని స్టేబుల్‌ స్థాయి అధికారి కేసు తీవ్రతను, భవిష్యత్తు ప్రమాదాన్ని పసిగట్టలేక పోయా రని తెలుస్తోంది. ఆ అధికారి ఇరుపక్షాలను పిలిచి మాట్లాడి, రాజీ చేసుకుంటున్నట్లు ప త్రం రాయించుకున్నారు. సాయంత్రం వారం దరినీ ఇళ్లకు పంపేశారు. అయితే పోలీస్‌ స్టేషన్‌ నుంచి ఇంటికి వెళ్లిన 10 నిమిషాలకే ఈ ఘాతుకం జరిగిందని శ్రీధర్‌ తెలిపారు.



సహకరించని స్థానికులు

తాము వచ్చి మంటలు ఆర్పేంత వరకు బాధితుల శరీరాలు కాలుతూనే ఉన్నట్లు పోలీసు కానిస్టేబుల్‌ ఒకరు చెప్పారు. మంటలు ఆర్పేందుకు దుప్పటి కోసం ప్రయత్నించినా స్థానికులెవరూ సహకరించలేదని.. మట్టిపోసి మంటలు ఆర్పాల్సి వచ్చిందని తెలిపారు. ఘటన సమయంలో నిందితులు గంజాయి మత్తులో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top