మృతదేహాలతో హైవేపై ఆందోళన


కేతేపల్లి: ప్రమాదాల నివారణకు కేతేపల్లి మండలం ఇనుపాముల వద్ద సర్వీసురోడ్డు, అండర్‌పాసింగ్ నిర్మాంచాలని కోరుతూ  శుక్రవారం గ్రామస్తులు హైవేపై ఆందోళన నిర్వహించారు. గురువారం సాయంత్రం ఇనుపాముల వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో గ్రామానికి చెందిన తిరుగుడు అంతయ్య(45) మృతిచెందగా, పట్టేటి విద్యాసాగర్ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం స్థానిక బస్‌స్టేజీ వద్ద రోడ్డు దాటుతున్న సూ ర్యాపేటకు చెందిన వృద్ధురాలు గుంటి జగదాంబ(70)ను కారు ఢీకొట్టడంతో మృతిచెం దింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మహిళలు వందలాదిగా హైవే పైకి చేరుకుని ధర్నా నిర్వహించారు. మృతదేహాలను రోడ్డుపై ఉంచి రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న కేతేపల్లి ఎస్‌ఐ వి.బాలగోపాల్ సిబ్బందితో కలసి సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు. తమ సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు విన్నవించి పరిష్కరించుకోవాలని, హైవేపై ట్రాఫిక్‌ను అడ్డకోవటం సరికాదన్నారు.



దీంతో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలోని సమస్యలను జిల్లా అధికారుల నుంచి కేంద్ర మంత్రుల వరకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేకపోయిందని ఆవేదనవ్యక్తం చేశారు. జీఎ మ్మార్ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి తమ గ్రామంలో అండర్‌పాస్ నిర్మిస్తామని హామీ ఇచ్చేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. ఆందోళనకారులు వందల సంఖ్యలో ఉండటం, పోలీసు సిబ్బంది తక్కువగా ఉండటంతో పోలీసులు చేసేదేమీ లేక జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అం దించారు. రాస్తారోకో ప్రారంభమై అప్పటికే రెండు గంటల సమయం దాటిపోవటంతో హైవేకు ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.



సమాచారం అందుకున్న నల్లగొండ డీఎస్పీ రాములునాయక్, నకిరేకల్, శాలి గౌరారం, సూర్యాపేట సీఐలు సురేష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, వై.మొగిలయ్య, పలువురు ఎస్‌ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు సంఘటన స్థలం వద్దకు చేరుకున్నారు.ఆయా గ్రామా ల అవసరాల మేరకు ఇనుపాముల వద్ద అండర్‌పాసింగ్,సర్వీసు రోడ్లు నిర్మించాల్సిన అవసరాన్ని డీఎస్పీరాములునాయక్ ఎన్‌హెచ్‌ఏఐ, జీఎమ్మార్ అధికారులకు ఫోన్‌లో వివరించారు. సమస్యలను స్థానిక ఎంపీ సిఫారసుతో రాత పూర్వకంగా నివేదిస్తే కేంద్ర అధికారులకు విన్నవించి అనుమతులు పొందుతామని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు డీఎస్పీకి తెలిపారు.అయిన్పటికీ ఆందోళనకారులు రాస్తారోకో విరమించేందుకు ఒప్పుకోలేదు. చివరి డీఎస్పీ రాములునాయక్ స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో మరోసారి మాట్లాడి ఎన్‌హెచ్‌ఏఐ, జీఎమ్మార్ అధికారులతో శుక్రవారం సాయంత్రం ముఖాముఖి సమావేశాన్ని ఖరారు చేయటంతో ఆందోళనకారులు రాస్తారోకో విరమించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top