కార్పొరేట్ గుప్పిట్లో విద్యారంగం


  • అందుకే ప్రభుత్వ విద్యకు కష్టాలు

  • ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ

  • విద్యార్థులకు ‘తామా’ స్కాలర్‌షిప్స్ ప్రదానం

  • సాక్షి,సిటీబ్యూరో: కార్పొరేట్ మాఫియా ప్రవేశంతో తెలంగాణలో ప్రభుత్వ విద్యకు కష్టాలు ఎదురయ్యాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. ఆదివారం రవీంద్రభారతిలో ‘తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా’( తామా) ఆధ్వర్యంలో జరిగిన ఉపకార వేతనాల పంపిణీ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యలో ముస్లింలు వెనకబడి ఉన్నారని, 40 శాతం మంది స్కూళ్లకు వెళ్లడం లేదని, వెళ్లేవారిలో 30 శాతం మంది మధ్యలోనే బడి మానేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.



    ప్రతి పోలీస్ స్టేషన్‌లో అదనంగా ఒక ఎస్‌ఐని నియమించి ఆయా స్టేషన్ల పరిధిలో పిల్లలు పాఠశాలకు వెళ్లేలా నిర్బంధ విద్యను అమలు చే యాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు. విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ.. అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదవాలనే బిల్లు తేవ డం అవసరమన్నారు. ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రాధమిక తరగతుల్లో మాతృ భాషలోనే బోధన జరగాలన్నారు.



    సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ పిల్లలను ప్రోత్సహించేందుకు ‘టామా’ ఆశయం ఉన్నతమైందని కితాబిచ్చారు. టా మా మాజీ చైర్మన్ వి.సీత మాట్లాడుతూ 23 జిల్లా నుం చి 46 మందికి మెరిట్ స్కాలర్‌షిప్స్ అందజేస్తున్నామన్నారు. అనంతరం ఒక్కొక్కరికి రూ.9 వేలు చెక్కు, ప్రశంసాపత్రం అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమా లు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిం డెంట్ శ్రీధర్, డాక్టర్ జయశంకర్ పరిశోధన అభివృద్ధి కేంద్రం అధ్యక్షుడు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

     

    సైంటిస్టునవుతా



    గోపవరం మండలం కాలువపల్లి ఉన్నత పాఠశాలలో ఈ ఏడాది పదో తరగతిలో ‘ఏ వన్’ గ్రేడ్ సాధించా. ఇప్పుడు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ త్రిపుల్ ఐటీలో చుదువుతున్నా. ‘తామా’ స్కాలర్‌షిప్ అందుకోవడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో అబ్దుల్ కలాం లా సైంటిస్ట్‌ను అవుతా.  - ఒంటెద్దు మాధవ్ కుమార్

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top