ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా?

ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా?


అధికారులు కుమ్మక్కయ్యారు. వారు చేసే పనికి ఐఏ‘ఎస్’ అండగా నిలబడ్డారు. బల్దియాలో ఇక అడ్డేముంది? నిబంధనలతో పనేముంది? అర్హతలు లేకున్నా నచ్చిన కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించేందుకు సిద్ధమయ్యారు. అదేదో లక్ష, రెండు లక్షల విలువ చేసే పనులకున్నారా? అట్లా భావిస్తే పప్పులో కాలేసినట్లే. ఏకంగా 10 కోట్ల విలువ చేసే పనులను సదరు కాంట్రాక్టర్‌కు అప్పగించే దస్త్రంపై సంతకం చేశారు.



అందుకు ప్రతిఫలంగా అధికారులకు ఎంత ముట్టిందనేది మాత్రం రహస్యమే. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆనోటా ఈనోటా పడి తీరా టెండర్ అక్రమాల గుట్టు రట్టవడంతో కంగుతిన్న అధికారులు చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. రాజీమార్గం కోసం అమాత్యుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంతకీ ఈ టెండర్ అక్రమాల కహానీ, అర్హతలేని కాంట్రాక్టర్‌తో అధికారుల కుమ్మక్కు, వారికి అండగా బల్దియా కమిషనర్ సాగించిన బాగోతమేమిటో పరిశీలిద్దాం.



సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో సుమారు వెయ్యిమంది కాంట్రాక్టు కార్మికుల నియామకానికి ప్రతి పాదనలను సిద్ధం చేసిన అధికారులు జూలై 30న టెండర్లను ఆహ్వానించారు. రూ.9.8 కోట్ల అంచనా తో కూడిన ఈ టెండర్‌లో పాల్గొనేందుకు సంస్థలు 19 రకాల ధువ్రీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉండగా, అందులో 14 పత్రాలను తప్పనిసరి (మాండేటరీ)గా సమర్పించాలనే నిబంధనలను పొందుపరిచారు.



వీటిలో క్లాస్-4 రిజిస్ట్రేషన్, ఈఎండీ, ఏపీటీఎస్ ట్రాన్సాక్షన్ ఫీజు, రూ.లక్ష అదనపు సెక్యూరిటీ డిపాజిట్, వ్యాట్ డాక్యుమెంట్, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ తోపాటు జూన్ నెల వరకు పీఎఫ్, ఈఎస్‌ఐ క్లియరెన్స్ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి నిబంధనల్లో ఉన్నా యి. ఆగస్టు 18న టెక్నికల్ బిడ్ తెరిచి ఒక్కో పనికి 8నుంచి 10షెడ్యూళ్లు దాఖలైనట్లు తెలిపారు. నిబంధనల ప్రకారం ఉన్న వాటినే ప్రెజ్ బిడ్‌లో తెరవాల్సి ఉంటుంది. అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరిచి టెండర్లను నెలరోజుల పాటు డౌన్‌లోడ్ చేసేందుకే సమయం తీసుకున్నారు.



తప్పనిసరి అర్హతలివి..

మొత్తం 8కాంట్రాక్టు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా.. తక్కువ మొత్తానికి కోట్ చేసిన శ్రీరాజరాజేశ్వరి వీఎల్‌సీసీఎస్ లిమిటెడ్ అనే సంస్థను సక్సెస్‌ఫుల్ బిడ్డర్‌గా ఎంపిక చేశారు. ఇంతవరకు బాగా నే ఉన్నా.. సదరు సంస్థకు టెండర్‌లో పాల్గొనే అర్హత పత్రాలే లేకపోవడం గమనార్హం. తప్పనిసరిగా పేర్కొన్న 14 పత్రాల్లో కీలకమైన ఈపీఎఫ్, ఈఎస్‌ఐ, టర్నోవర్ వంటి పత్రాలనూ ఆ కాంట్రా క్టు సంస్థ సమర్పించలేదు.

 

అర్హతలేకున్నా.. అప్పగింత

అర్హత లేని ఈ సంస్థకు ఏకంగా రూ.10 కోట్ల కాంట్రాక్టును అప్పనంగా కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. ‘అసలే అర్హతల్లేవు... అందులోనూ మ్యాన్‌పవర్ సరఫరాలోనూ పెద్దగా అనుభవం లేకున్నా కార్మికుల నియామకపు పనులు అప్పగించేందుకు అధికారులు ఉత్సాహం చూపడంలో మతలబు ఏమిటి?’ అని మిగిలిన కాంట్రాక్టర్లంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరి పత్రాలను తరువాత ఎప్పుడైనా సమర్పించే అవకాశం సదరు సంస్థకు ఇవ్వడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘కరీంనగర్‌లో మొత్తం 125 కాంట్రాక్టు సంస్థలున్నా అర్హతల్లేవనే కారణంతో అందులో సింహభాగం టెండర్లలో పాల్గొనలేదు.



ఆ సంస్థకు ఇచ్చినట్లు వెసులుబాటు ఇస్తే కనీసం వంద కాంట్రాక్టు సంస్థలు కూడా అందులో పాల్గొనేవి కదా?’ అని ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉన్నా అంతకం టే తక్కువకు టెండరు వేసిన సంస్థకు పనులు ఎట్లా అప్పగిస్తారని, అలాంట ప్పుడు తమ పరిస్థితేమిటని కార్మికులు వాపోతున్నారు. ‘నిబంధనలు రూపొం దించి టెండర్లు అప్‌లోడ్ అయ్యాక అనుకూలమైన వారి కోసం మార్చడం ఎంతవరకు సమంజసం? తప్పనిసరి అర్హతలను మార్చే అధికారం బల్దియా కమిషనర్‌కు సైతం లేదు. అయినా తుంగలో తొక్కారంటే దీనివెనుక పెద్ద మతలబే ఉంది’ అని సంస్థలోని ఉద్యోగులూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

 

ఐఏ‘ఎస్’ అంటే నిబంధలు వర్తించవా?


మొదట శ్రీరాజరాజేశ్వర సంస్థకు టెండర్లలో పాల్గొనే అర్హత లేని ఫైలుపై సంతకాలు చేసిన అధికారులు... ఆ తరువాత అదే సంస్థకు రూ.10 కోట్ల పనుల అప్పగించేందుకు సిద్ధమవడం చర్చనీయాంశమైంది. అందుకోసం మాండేటరీ నిబంధనలను తుంగలో తొక్కి అధికారులు ఫైలు సిద్ధం చేస్తే దానిపై బల్దియా కమిషనర్ అయిన ఐఏఎస్ శ్రీకేశ్ లట్కర్ సం తకం చేయడం మరింత విస్మయానికి గురిచేస్తోంది. ఐఏఎస్ అయితే నిబంధన లు వర్తించవన్నట్లుగా గుడ్డిగా సంతకం చేయడమేంటని, తప్పులు సరిదిద్దాల్సి న కమిషనరే తప్పు చేస్తే బల్దియా అక్రమాలను అడ్డుకునేదెవరని ప్రశ్నిస్తున్నా రు. ఈ బాగోతంలో బల్దియా ఎస్‌ఈ, ఈఈ అసలు సూత్రధారులనే ఆరోపణలూ విన్పిస్తున్నాయి. శ్రీరాజరాజేశ్వర సంస్థకు కనీస అర్హతల్లేనందున సదరు దస్త్రంపై తాను మాత్రం సంతకం చేయబోనని డెప్యూటీ ఈఈ సంపత్‌రావు తెగేసి చెప్పినప్పటికీ, పక్కనపెట్టి సదరు సంస్థకు పనులు అప్పగించడం విశేషం.

 

రాజీకి అధికారుల పాట్లు

టెండర్ అక్రమాల బాగోతం బట్టబయలవడంతో బల్దియా కమిషనర్ సహా సదరు అధికారులంతా రాజీ యత్నాలు ప్రారంభించారు. నగర మేయర్, కార్పొరేటర్ల వద్దకు వెళ్లి పొరపాటైందని, దీనిని ఇంతటితో వదిలేయాలని ప్రాధేయపడుతున్నారు. బల్దియా కమిషనర్ శ్రీకేష్ లట్కర్ సైతం ‘ఇందులో నా తప్పేమీ లేదు. కిందిస్థాయి అధికారులు రూపొం దించిన ఫైలుపై చూసుకోకుండా సంత కం చేశాను’ అని రాజీ బేరానికి వస్తున్నట్లు తెలిసింది. మరోవైపు టెండర్ బాగోతంపై నగర మేయర్ రవీందర్‌సింగ్, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. బాధ్యులైన అధికారులందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మకు కమలాకర్ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయాలని నిర్ణయిం చినట్లు తెలిసింది. అదే సమయంలో మేయర్ సైతం కమిషన ర్ సహా బాధ్యులపై చర్యలు తీసుకునే దిశగా చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top