గులాబీ గూటికి కాంగ్రెస్ కౌన్సిలర్లు?

గులాబీ గూటికి కాంగ్రెస్ కౌన్సిలర్లు? - Sakshi


నల్లగొండ మున్సిపాలిటీలో సమీకరణలు అతి వేగంగా మారుతున్నాయి. మెజార్టీ కౌన్సిలర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి కొద్దిరోజుల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీలోకి వలసలు పెద్దఎత్తున జరగవచ్చునని రాజకీయ వర్గాలలో చర్చ జోరందుకుంది. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కాంగ్రెస్ కౌన్సిలర్లలో అసమ్మతి కుంపటి రాజేశాయి. దీంతో పార్టీ వీడేందుకు కొద్ది రోజులుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరొందిన ఓ నాయకుడు పలువురి కౌన్సిలర్లతో చర్చలు జరిపి గులాబీ గూటికి చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

 

 నల్లగొండ టుటౌన్ : నల్లగొండ మున్సిపాలిటీల్లో మొత్తం 40 వార్డులకు కాంగ్రెస్ పార్టీ 22, టీఆర్‌ఎస్ 2, టీడీపీ 4, బీజేపీ 4, ఇండిపెండెంట్లు 3, ఎంఐ ఎం 3, సీపీఎం 2 గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు ఇద్దరు టీఆర్‌ఎస్‌లో చేరగా, ఒకరు సీపీఎం అనుబంధంగా కొనసాగుతున్నారు. స్పష్టమైన మెజారిటీ ఉన్న కాంగ్రెస్ పాలకవర్గాన్ని ఏర్పాటుచేసింది. అయితే ఎన్నికల ముం దు నిర్ణయించిన చైర్‌పర్సన్ అభ్యర్థి ఓడిపోవడంతో అనూహ్యంగా మరో సభ్యురాలికి అవకాశం వచ్చింది. అయితే ఆమె భర్త ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నది తోటి వార్డుసభ్యుల ఆరోపణ. మొదట ఇద్దరు, ముగ్గురు కౌన్సిలర్లు పార్టీ మారడానికి ప్రయత్నించడంతో కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు వారితో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకున్నా అందరం కలిసే తీసుకుందామని చెప్పడంతో ఆగిపోయారు. అసలు పోటీలోలేని వ్యక్తి.. చైర్‌పర్సన్ కావడానికి తాము సంపూర్ణ సహకారం అందిస్తే ఆ తరువాత ఆమె భర్త అన్నీ తానై సీనియర్లను విస్మరించి, తమకు చెప్పకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడని పలువురు కౌన్సిలర్లు ఆ నాయకుడి వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. పాలకవర్గంలో గట్టిగా ఉన్న విపక్షాలకు తాము దీటుగా సమాధానం చెబితే, తమను ఏ మా త్రమూ పరిగణనలోకి తీసుకోకుండా జూనియర్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వడం కూడా అసమ్మతి కుంపటికి కారణమని చెబుతున్నా రు. సుమారు 15మంది కౌన్సిలర్లు చైర్‌పర్సన్ భర్త తీరుపై గుర్రుగా ఉన్నట్లు  తెలుస్తోంది.

 

 ఇప్పటికే టీఆర్‌ఎస్ ముఖ్య నేతతో చర్చ

 గత కౌన్సిల్ సమావేశానికి కూడా కోమటిరెడ్డి ముఖ్య అనుచరుడు గైర్హాజరయ్యాడు. అప్పటినుంచే కాంగ్రెస్ నుంచి కారెక్కేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. టీఆ ర్‌ఎస్ ముఖ్య నాయకుడితో ఇప్పటికే చర్చిం చినట్లు సమాచారం. సాధ్యమైనంత ఎక్కువమంది కౌన్సిలర్లు పార్టీ మారేలా టీఆర్‌ఎస్ నాయకులు దృష్టి కేంద్రీకరించినట్లు తెలిసింది. కాంగ్రెస్ కౌన్సిలర్లలో చాపకింద నీరులా నెల కొన్న అసమ్మతి ఇప్పుడు పార్టీని వీడేదాక రావడంతో ముఖ్య నాయకులు సైతం ఖంగుతి న్నట్లు సమాచారం. దాదాపు 10 మంది కౌన్సిలర్లు కారెక్కడానికి సిద్ధంగా ఉన్న ట్లు సమాచారం. రెండు మూడు రోజులుగా పార్టీ మారే ఆలోచనలో ఉన్న ముఖ్యనేత ఇంట్లో పలుసార్లు నిర్వహించిన సమావేశానికి 8మంది కౌన్సిలర్లు హాజరైనట్లు తెలిసింది. మంగళవారం కూడా వీరు సమావేశమై అన్నీ కుదిరితే వారం రోజు లలోనే పార్టీ వీడాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విషయం తెలసుకున్న కాంగ్రెస్ నాయకులు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top