ఢీ ‘దేశం’ గీ దండోరా

ఢీ ‘దేశం’ గీ దండోరా


ఇందూరు: తెలుగుదేశం పార్టీ శనివారం నగరంలోని శివాజీనగర్ మున్నూరుకాపు కల్యాణ మండపంలో నిర్వహించిన జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. టీడీపీ, ఎంఆర్‌పీఎస్ కార్యకర్తల ఘర్షణతో అయోమయం నెలకొంది. ఇరువర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.



సభకు అధ్యక్షత వహించిన పార్టీ జిల్లా కన్వీనర్, ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ప్రసంగం కొనసాగుతుండగా ఎంఆర్‌పీఎస్ నాయకులు ఒక్కసారిగా వేదిక మీదకు దూసుకు వచ్చారు. అక్కడ ఉన్న ఫ్లెక్సీని తొలగించి. బల్లలను విసిరేశారు. దీంతో తొలుత నిర్ఘాంతపోయిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు అనంతరం ఆగ్రహంతో ఊగిపోయారు.ఎంఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు.                

 

కుర్చీలతో చావబాదారు. నాల్గవ, ఐదవ పట్టణ ఎస్‌ఐలు మధు, సైదయ్య వెంటనే వెళ్లి వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారికి సైతం దెబ్బలు తగిలాయి. స్వల్పంగా లాఠీచార్జి చేసి ఎంఆర్‌పీఎస్ నాయకులను అరెస్టు చేసి తీసుకెళుతున్న పోలీసులపై టీడీపీ నాయకులు కుర్చీలు విసిరారు.



గేటు వద్ద కాపుగాసి

మరికొంత మంది ఎంఆర్‌పీఎస్‌నాయకులు సమావేశం ప్రవేశమార్గం వద్ద ఉన్న వాహనాలపై దాడిచేశారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు వారిని కూడా అరెస్టు చేసి నగర ఐదవ ఠాణాకు తరలించారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో వేదికపై ఉన్న టీడీపీ నేతలు ఖంగుతిన్నారు.  



కేవలం 15 నిమిషాలలోనే 20 మందికిపైగా ఎంఆర్‌పీఎస్‌నాయకులు సమావేశాన్ని రసాభాసాగా మార్చేశారు. కుర్చీలు ధ్వంసమయ్యాయి. సమావేశం అదుపు తప్పింది. టీడీపీ నాయకులు ఎంఆర్‌పీఎస్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వేదికపై ఉన్న టీడీపీ నేతలు రమణ, రేవంత్‌రెడ్డి ఘటన చూస్తు విస్తుపోయా రు. ఈ క్రమంలో ఎమ్మె ల్సీ అరికెల నర్సారెడ్డి వారిం  చినప్పటికీ టీడీపీ నాయకు లు, కార్యకర్తలు ఎంఆర్‌పీఎస్ నాయకులపై దాడి చేశారు.  

 

ఆరుగురు అరెస్టు  

నిజామాబాద్ సిటీ: తెలుగుదేశం పార్టీ సమావేశంలోకి దూసుకువచ్చి గొడవ చేసిన ఆరుగురు ఎంఆర్‌పీఎస్ నాయకులను అరెస్టు చేసినట్లు నాల్గవ టౌన్ ఎస్‌ఐ మధు తెలిపారు. వర్ని రోడ్డు శివాజీనగర్ ము  న్నూర్‌కాపు సంఘంలో జరుగుతున్న సభలోకి ఎంఆర్‌పీఎస్ నాయకులు గందమాల నాగభూషణం, మైలారం బాలు, కిష్టయ్య, శ్రీనివాస్, సంతోష్, భూమన్న చొచ్చుకు వచ్చి అంతరాయం కలిగించారని అన్నారు. కుర్చీలు విసిరేసిటీడీపీ నాయకులు, కార్యకర్తలతో గొడవపడ్డారని వివరించారు. పై ఆరుగురిపై కేసు నమోదు చేసామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top