ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి


* మహానాడులో మరోసారి తీర్మానం

* టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు

* ఎన్టీఆర్ పేరుతో చీర, ధోవతి స్కీమ్

* తెలుగు ప్రజల అభివృద్ధే మా ఆశయం

* ఇరు రాష్ట్రాల సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి

* పార్టీ కోసం మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం


 

సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరు తూ మహానాడులో మరోసారి తీర్మానం చేశా రు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని గురువారం రెండోరోజు మహానాడు వేదికపై ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. వేది కపై కేక్ కట్‌చేసి, ఆయన సేవలను కొనియాడా రు. చేనేత కార్మికులకు ఉపయుక్తంగా ఉండేలా ఏపీలో ఎన్టీఆర్ పేరుతో చీర, ధోవతి కార్యక్రమాన్ని ప్రవేశపెడుతున్నట్టు ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ ఏడాది దసరా పండుగ నుంచి రూ.400 కోట్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు వెల్లడించారు.

 

  శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్‌టీఆర్ విగ్రహాన్ని రాజమండ్రిలో గోదావరి గట్టున ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్టీఆర్ గొప్ప మానవతావాది అని కొనియాడారు. రాయలసీమలో కరువు సంభవించినపుడు జోలెపట్టి విరాళాలు సేకరించి ఆదుకున్నారని చెప్పారు. ఎన్‌టీఆర్ దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చారని, దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర పార్టీలను ఏకం చేసిన ఘనత ఆయనదేనన్నారు. ఎక్కడున్నా తెలుగు ప్రజల అభివృద్ధే తమ ఆశయమని చెప్పారు. తెలంగాణకు తాము విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఆ ప్రభుత్వం మాత్రం వ ద్దం టోందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఏ సమస్యనైనా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధమని ఆయన చెప్పారు.

 

 కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటాం

పార్టీ కోసం కష్టపడుతూ మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని చంద్రబాబు చెప్పారు. గత ఏడాది మహానాడుకు హాజరై తిరిగి వెళుతూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఇద్దరు కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలను అందచేశారు. ఈ మహానాడుకు హాజరై బుధవారం గుండెపోటు తో మరణించిన రాయుని చెన్నయ్య కుటుం బానికి పార్టీ పరంగా రూ. పది లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలను ఆదుకోవటం, తెలంగాణలో ప్రభుత్వంపై ఎలా పోరాటం చేయాలో  ప్రతినిధులు సూచించాలని కోరారు. వాటి ఆధారంగా తా ను శుక్రవారం నవసూత్రాలను ప్రకటిస్తానని చెప్పారు. పేదల గుండెల్లో ఎన్‌టీఆర్‌ది సుస్థిరస్థానమని ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. ఎన్‌టీఆర్‌తో కలిసి పనిచేయటం తమ అదృష్టమని కేం ద్రమంత్రి పి. అశోక్ గజపతిరాజు తెలిపారు.

 

 ద్రోహులను చేర్చుకున్న కేసీఆర్: ఎర్రబెల్లి

 ఏడాది గడిచినా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వేదిక నుంచి పార్టీ తెలంగాణ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ ద్రో హులకు మంత్రివర్గంలో ప్రాధాన్యతనిచ్చిన కేసీఆర్, ఉద్య మంలో కీలకపాత్ర పోషించిన విద్యార్థులకు ఏం చేశారో చెప్పాలన్నారు. తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎప్పుడూ పోరాటం చేయలేదని, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాసయాదవ్ ‘జై తెలంగాణ’ అని ఎప్పు డూ అనలేదని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా టీడీపీ లేఖ రాయకుండా చం ద్రబాబును అడ్డుకుంది శ్రీనివాసయాదవ్ అని వెల్లడించారు.   తనను గవర్నర్ చేస్తానని చంద్రబాబు అంటున్నారని, తాను ఆ పదవిని అధిష్టించినా లేకపోయినా కేసీఆర్‌ను ఓడించటమే లక్ష్యంగా పని చేస్తానని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. మీరు గవర్నర్ అయితే ఇక్కడ అరిచే వారుండరని చంద్రబాబు వ్యాఖ్యానిం చగా... మీరు ఎలా వాడుకున్నా, ఏది చెప్పినా తూచా తప్పకుండా చేస్తానని నర్సింహులు చెప్పారు. చంద్రబాబును కీర్తిస్తూ హేమమాలిని అనే బాలిక వినిపించిన కవిత ప్రతినిధులను ఆకట్టుకుంది.

 

 రాజధాని నిర్మాణానికి రాక్షసుల్లా అడ్డం

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధాని అమరావతి నగర నిర్మాణానికి ప్రభుత్వం దీక్షతో యజ్ఞంలా పనిచేస్తుంటే కొందరు రాక్షసుల్లా అడ్డం పడుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. అలాంటివారు రాక్షసుల్లానే మిగిలిపోతారని చె ప్పారు. అమరావతి నిర్మాణాన్ని ఎవరైనా విమర్శిస్తే ఎన్‌టీఆర్ స్ఫూర్తితో బుల్లెట్‌లా వారిపై దూసుకుపోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహానాడు రెండో రోజు గురువారం చేసిన ఏడు తీర్మానాల్లో నూతన రాజధాని నిర్మాణంపై తీర్మానం కూడా ఉంది. చంద్రబాబు మాట్లాడుతూ ఎంతమంది అడ్డం పడినా రాజధాని నిర్మాణం, అభివృద్ధిని అడ్డుకోలేరని చెప్పారు.  సోనియా గాంధీ వ్యతిరేకించినా రైతులు భూములిచ్చారని, వారికి అన్యాయం జరగనివ్వబోమని తెలిపారు. రాజధాని నిర్మాణానికి జూన్ ఆరో తేదీన భూమి పూజ చేస్తామని, దసరా నాడు శంకుస్థాపన చేస్తామని చెప్పారు. చారిత్రక నేపధ్యం ఉన్నందునే రాజధానికి అమరావతి అని పేరు పెట్టామని, అమరావతి అంటే మృత్యువులేని నగరం అని అర్థమని వివరించారు.

 

 బాబు మనవడి పేరు దేవాంశ్

 తన మనవడికి దేవాంశ్ అని పేరు పెట్టినట్లు మహానాడు వేదిక నుంచి చంద్రబాబు ప్రకటిం చారు. తన కుమారుడు లోకేశ్, కోడలు బ్రహ్మణి దంపతులకు కొడుకు పుట్టాడని, ఆ బాలుడికి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ పుట్టిన రోజునాడే దేవాంశ్ అని పేరు పెడుతున్నట్లు చెప్పారు. లోకేశ్, బ్రహ్మణి కూడా తమ కుమారుడిని ఎత్తుకుని ముద్దాడుతున్న ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేశారు.  

 

 జాతీయాధ్యక్షుడిగా చంద్రబాబు

 చంద్రబాబు ఇకనుంచి పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు వేర్వేరుగా కమిటీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడటంతో పార్టీలో కొత్తగా జాతీయ అధ్యక్ష పదవి ఏర్పాటు చేయగా, అందుకోసం మహానాడులో ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. చంద్రబాబు తరఫున ఆరు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఆయన ఎన్నికను శుక్రవారం అధికారికంగా ప్రకటిస్తారు. ఆ తర్వాత రెండు రాష్ట్రాలకు విడిగా అధ్యక్షులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే వారితోపాటు మిగిలి పదవులన్నింటికీ ఎంపిక చేసే అధికారాన్ని బాబుకు కట్టబెడుతూ శుక్రవారం మహానాడులో తీర్మానం చేయనున్నారు. పార్టీలో ఇప్పటివరకు తొమ్మిదిసార్లు అధ్యక్షుడిగా ఎన్నికైన చంద్రబాబు శుక్రవారం నుంచి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top