రెండేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పూర్తి


రామన్నపేట : ఉమ్మడి నల్ల గొండతో పాటు పలు జిల్లాలోని 36 వేల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రెండేళ్లలో పూర్తిచేసి రైతుల కాళ్లు కడుగుతామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు స్పష్టం చేశారు. మంగళవారం మండల కేంద్రంలో రూ.66 కోట్లతో చేపట్టనున్న ధర్మారెడ్డిపల్లి కాల్వ ఆధునికీకరణ పనులకు విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నుంచి గంధమల్ల, బస్వాపూర్‌ రిజర్వాయర్ల ద్వారా నకిరేకల్‌ నియోజకవర్గంలోని 55 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు.



 చనిపోయిన వారి పేరిట కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్ట్‌లను అడ్డుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులు కుట్ర పన్నారని ఆరోపించారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ ఆధునికీకరణ పనులు ఆరు నెలల్లో పూర్తిచేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.  విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే జనం రోడ్ల మీదికి వచ్చే రోజులు పోయాయని అన్నారు. ప్రతిపక్షాలకు రా ష్ట్రంలో మాట్లాడటానికి ఏ అంశం దొరక్క ధర్నా చేయడానికి జాగా కావాలని కొత్త నినాదాన్ని తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశా రు. రాష్ట్రంలో ఎవడికి ఏది నోటికొస్తే.. అది మాట్లాడడం పరిపాటి అయ్యిందని ప్రతిపక్షనేతలను విమర్శించారు.



ఈ కార్యక్రమంలో ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కలెక్టర్‌ అనితారామచంద్రన్, జేసీ గుగులోతు రవినాయక్, ఆర్డీఓ సూరజ్‌కుమార్, ఎంపీపీ కక్కిరేణి ఎల్లమ్మ, జెడ్పీటీసీలు వసంత, యాదగిరి, ప్రశాంత్, సర్పంచ్‌ నకిరేకంటి మొగులయ్య, ఎంపీటీసీలు ఆకవరపు మధుబాబు, ఊట్కూరి శోభ, గంగుల వెంకటరాజిరెడ్డి, బందెల రాములు, పూజర్ల శంభయ్య, జెల్ల మార్కం డేయ, పూస బాలకిషన్, గంగుల క్రిష్ణారెడ్డి, ముక్కాముల దుర్గయ్య, జినుకల ప్రభాకర్, కక్కిరేణి విజయ్‌కుమార్, సోమనబోయిన సుధాకర్‌యాదవ్, అంతటి రమేశ్, బత్తుల క్రిష్ణగౌడ్, ఎడ్ల మహేందర్‌రెడ్డి, రామిని రమేశ్, సాల్వేరు లింగం పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top