అడవిలో కలెక్టర్‌

అడవిలో కలెక్టర్‌

- 13 కి.మీ కాలినడక 

మొక్కలు నాటే ప్రాంతాల పరిశీలన..

 

నర్సాపూర్‌: సెలవులు వస్తే కుటుంబ సభ్యులతో కలసి సరదాగా గడపటం పరిపాటి. ఉద్యోగులు మరీ ఎక్కువగా ఇందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ మెదక్‌ జిల్లా కలెక్టర్‌ భారతీ హోళికేరి అధికార కార్యక్రమంలో భాగంగా అటవీబాట పట్టారు. జడ్పీ చైర్‌పర్సన్‌ రాజమణి, అధికారులతో కలసి 13 కిలోమీటర్లు కాలినడకన తిరిగి అడవిని పరిశీలించారు. ఈ నెల 26న అటవీ మంత్రి జోగురామన్న నర్సాపూర్‌ రానున్న నేపథ్యంలో కలెక్టర్‌ స్థానిక అధికారులతో కలసి అడవిలో పర్యటించారు.



పంది వాగును ఆనుకుని ఉన్న కాలిబాట గుండా అడవిలో ప్రవేశించారు. మొక్కలు నాటే ప్రాంతాలను పరిశీలించారు. ఖాళీ ప్రాంతాల్లో లక్ష మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చే స్తున్నామని ఆర్డీఓ వారికి వివరించా రు. గోతులు తీస్తున్న కూలీలతో కలెక్టర్‌ భారతి రోజుకు ఎన్ని గోతులు తీస్తున్నారని, కూలి ఎంత వస్తోందని ఆరా తీశారు. కలెక్టర్‌ వెంట ఎఫ్‌ఆర్‌ఓ రాఘవేందర్‌రావు, తహసీల్దార్‌ మనో హర్, ఎంపీడీఓ శ్రవణ్‌కుమార్‌ తదితరులున్నారు. 

 

కుటుంబసభ్యులతో సరదాగా

పర్యటన అనంతరం కలెక్టర్‌ అడవిలో కుటుంబసభ్యులతో  గడిపారు. పచ్చి క బయళ్లు, వాగులు, గుట్టలను తిలకించారు. నర్సాపూర్‌ రాయరావు చెరు వు మరమ్మతు పనులను పరిశీలించారు. చెరువు కింద ఆయకట్టు సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top