కొట్టకుండానే పగులుతున్న కొబ్బరికాయలు

కొట్టకుండానే పగులుతున్న కొబ్బరికాయలు


నల్గొండ: ఎండలు భగ్గుమంటున్నాయనడానికి ప్రత్యేక్ష నిదర్శనమే ఇది. నల్గొండ జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామంలో విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన కొబ్బరికాయలు ఎండ వేడికి కొట్టకుండానే పగలిపోతున్నాయి. వివరాలు.. సిరిపురం గ్రామంలోని కుక్కడపు నాగేశ్వరరావు కిరాణా షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.



ఆ షాపులో విక్రయ నిమిత్తం ఉంచిన కొబ్బరికాయలు బుధవారం మధ్యాహ్నం పగిలిపోయాయి. ఎండ వేడిమికి "మనుషులే తట్టుకోలేకుంటే.. కొబ్బరికాయలెంత" అని స్థానికులు వాపోతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top