సింగరేణి ప్లాంట్‌కు బొగ్గు రవాణా

సింగరేణి ప్లాంట్‌కు బొగ్గు రవాణా


మొదటి యూనిట్ ప్లాంటులో ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి

శ్రీరాంపూర్, మందమర్రి,

భూపాల్‌పల్లి నుంచి బొగ్గు సరఫరా

►  ప్లాంటులో 2.80లక్షల  టన్నుల బొగ్గు నిల్వలు


 


జైపూర్ :  మండల కేంద్రంలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న బొగ్గు ఆధారిత థర్మల్ ప్లాంటుకు అసరమైన బొగ్గును రోడ్డు మార్గంలో తరలిస్తున్నారు. సింగరేణి సంస్థ చేపడుతున్న 1200 మెగా వాట్ల ప్లాంటు పనులు తుది దశకు చేరాయి. మార్చిలో బొగ్గు, ఆయిల్‌తో యూనిట్-1 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి ప్రయోగాత్మకంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించగా ఈ నెలాఖరుకు యూనిట్-2 ప్లాంటును సింక్రనైజేషన్ చేసి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యుత్ ఉత్పత్తి బొగ్గు, నీరు ప్రధానం కావడంతో ఇప్పటికే షెట్‌పల్లి నుంచి 1టీఎంసీ నీటిని తరలించారు. రిజర్వాయర్-1 సిద్ధం చేశారు.



కాగా ప్లాంటుకు రైల్వేట్రాక్ ద్వారా బొగ్గు సరఫరా చేయాలని నిర్ణయించినా అది ఇప్పట్లో పూర్తి అయే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా రోడ్డు మార్గంలో బొగ్గు రవాణా చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సంస్థ జైపూర్ ప్లాంటు నుంచి మంచిర్యాల వరకు ప్రసుత్తం ఉన్న 63నంబరు జాతీయ రహదారిని రూ.19కోట్లతో నాలుగు వరుసల రోడ్డు విస్తరించింది. అలాగే జాతీయ రహదారి నుండి కోల్-హ్యాడ్లింగ్ ప్లాంటు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మించారు. శ్రీరాంపూర్ ఓసీపీ, మందమర్రి వాచర్, భూపాల్‌పల్లి ఏరియాలోని గనుల నుంచి లారీల ద్వారా ప్లాంటుకు బొగ్గు రవాణా చేస్తున్నారు. ఒక యూనిట్ ప్లాంటుకు (600మెగావాట్లు) ఒక రోజుకు 6 వేల టన్నుల బొగ్గు అవసరం అంటే రెండు యూనిట్లకు ఒక్కరోజుకు 12 వేల టన్నుల బొగ్గు అవసరం.



బొగ్గు నాణ్యతలోపిస్తే 12వేల నుంచి 15వేల టన్నుల వరకు అవసరం పడుతుంది. అయితే ప్లాంటు నుంచి పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి అరుుతే 12వేల నుంచి 15వేల టన్నుల బొగ్గు కావాల్సి వస్తుందని, కాని ప్రారంభ దశలో 1200 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదు. అరుునా ప్లాంటులో 2లక్షల 80వేల టన్నుల బొగ్గును నిల్వ చేశారు.





మొదటి యూనిట్ ప్లాంటు నుంచి     ఉత్పత్తి

1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంటులో మొదటి యూనిట్ (600 మెగావాట్ల) ప్లాంటు ను మార్చి 13న సింక్రనైజేషన్ చేయగా శుక్రవారం నుంచి నిరంతరం విద్యుత్ ఉత్పత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సింక్రనైజేషన్ చేసి బొగ్గు, ఆయిల్‌తో ప్రయోగాత్మకం గా ఒక్క రోజు విద్యుత్ ఉత్పత్తి చేసినా ఇక నుం చి యూనిట్-1 ప్లాంటు ద్వారా బొగ్గుతో ఉత్పత్తి చేయనున్నారు. మొదటి యూని ట్ ద్వారా వచ్చిన విద్యుత్‌ను 400కేవీ స్విచ్‌యార్డు ద్వారా గజ్వేల్ గ్రిడ్‌కు సరఫరా చేయనున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top