గజ్వేల్‌లో కేసీఆర్‌ పర్యటన

గజ్వేల్‌లో  కేసీఆర్‌ పర్యటన - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ తన సొంత నియోజకవర్గ మైన గజ్వేల్‌లో పర్యటిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన భేటీ అయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్‌లో పర్యటించి.. స్థాని కంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు.


కేసీఆర్‌ ఈ నెల 6న గజ్వేల్‌ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో జనహి తలో సమావేశం కానున్నట్లు తెలిసింది. గజ్వేల్‌ నియోజకవర్గాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపేందుకు ప్రణాళిక రూపొందిం చడంపై ఆ సమావేశంలో చర్చించను న్నట్లు సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top