Alexa
YSR
‘ఆర్థిక అసమానతలు తొలగకపోతే రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం లేదు’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం తెలంగాణకథ

ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

Sakshi | Updated: June 22, 2017 07:19 (IST)
ఢిల్లీకి సీఎం కేసీఆర్‌ వీడియోకి క్లిక్ చేయండి

► 23న కోవింద్‌ ‘రాష్ట్రపతి’ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ 23న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. కోవింద్‌ అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించడం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారు.

ఈ అధికారిక కార్యక్రమాలతో పాటు కంటికి శస్త్ర చికిత్స కూడా చేయించుకుంటారని తెలిసింది. నిజానికి ఈ శస్త్రచికిత్స కోసం మే లోనే సీఎం తన కుటుంబసభ్యులతో పాటు ఢిల్లీ వెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, కొద్ది రోజుల తర్వాతే శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినట్టు సమాచారం. ఆ మేరకు ఈ పర్యటనలో శస్త్రచికిత్స చేయించుకోవచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

వ్యాఖ్యలు

Advertisement

Advertisement

Advertisement

EPaper

టెట్..ఓకే

Advertisement

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC