మన సంస్కృతిని భావితరాలకు అందించాలి


పల్లారుగూడ (సంగెం) : రోజురోజుకూ కనుమరుగవుతున్న సంస్కృతీ సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. సంగెం మండలంలోని పల్లారుగూడ శివారు మహారాజ్‌తండాలో గురువారం సంగెం జెడ్పీటీసీ సభ్యురాలు గుగులోత్ వీరమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన తీజ్  ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యూరు.



ఈ సందర్భంగా రాజయ్యను గిరిజనులు డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగతించి సన్మానించారు. అనంతరం రాజయ్య మాట్లాడుతూ తీజ్ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. గిరిజనులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా... గత పాలకులు పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం రాగానే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆకాంక్షలను నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.



500 జనాభా ఉన్న తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతోపాటు 18 ఏళ్లు నిండిన గిరిజన యువతుల వివాహానికి కళ్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.50 వేల ఇవ్వనున్నట్లు ప్రకటించారని గుర్తు చేశారు. గిరిజనులు, మైనార్టీలు, దళితుల అభివృద్ధికి రూ.వేల కోట్లు కేటారుుంచారన్నారు. వ్యవసాయంపై ఆధారపడి జీవించే దళిత, గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమిని ఇస్తామన్నారు. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.1,500 చొప్పున దసరా నుంచి పింఛన్లు ఇవ్వనున్నట్లు పునరుద్ఘాటించారు.



ఐదేళ్లలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రణాళికలు రుపొందించుకుందామన్నారు. గంగదేవిపల్లిలాగ దేశంలో పేరు వచ్చేలా రాజకీయూలకతీతంగా... పోటీతత్వంతో గ్రామాభివృద్ధికి కృషిచేయూలన్నారు. కాగా, మైదాన ప్రాంతానికి ప్రత్యేక ఐటీడీఏను ఏర్పాటు చేయాలని రాజయ్యను పలువురు గిరిజనులు కోరారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, స్వామి నాయక్, వర్ధన్నపేట ఎంపీపీ మార్నెని రవీంద ర్‌రావు, లలితాయాదవ్, భరత్‌కుమార్‌రెడ్డి, మదన్‌కుమార్, సాగర్‌రెడ్డి, గోపీసింగ్, శంకర్‌రావు, దేవ్‌సింగ్, వీరన్న, యాదగిరిరావు. రాజు, సంపత్, సదానందం పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top