కాంగ్రెస్ కార్యక ర్తల ఘర్షణ


ఎదులాపురం, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్ నియోజకవర్గంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో కలి సికట్టుగా పనిచేసిన కాంగ్రెస్ కార్యకర్తల్లో మరోసారి వర్గ విభేదాలు బయట పడ్డాయి. బుధవారం డీసీసీ అధ్యక్షుడు సి.రాంచంద్రారెడ్డి నివాసానికి వచ్చిన ఎన్‌ఎస్‌యూఐ నాయకులు సీఆర్‌ఆర్ వర్గం నాయకులతో ఘర్షణకు దిగారు. ఇరువర్గాల నాయకులు పరస్పరం దాడికి పాల్పడ్డా రు. ఈ ఘర్షణలో సీఆర్‌ఆర్ వర్గం నాయకుడు తిప్ప నారాయణ గాయాలపాలై రిమ్స్ ఆస్పత్రి లో చేరాడు. కౌన్సిలర్ టిక్కెట్టు తమకు రాకపోవడానికి నారాయణనే కారణమని ఆరోపిస్తూ ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఆయనపై దాడికి పాల్పడ్డారని సీఆర్‌ఆర్ వర్గం నాయకులు పేర్కొం టున్నారు.



 మున్సిపల్, సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి విభేదాలు బయటకు రాకుండా ఉన్న సీఆర్‌ఆర్, భార్గవ్ దేశ్‌పాండే వర్గం నాయకు లు మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా వెలువడిన వెంటనే ఇరువర్గాల కార్యకర్తలు ఘర్షణకు దిగడం చర్చనీ యాశంగా మారింది. వర్గవిభేదాలు బయటకు రాకుండా ఎన్నికల్లో ప్రచారం నిర్వహించినా కాం గ్రెస్ కార్యకర్తలు  ఒక్కసారిగా ఘర్షణకు పాల్ప డం, కార్యకర్తకు గాయాలై రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందడంతో రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే దాడిలో గాయపడి రిమ్స్‌లో చికిత్స పొందుతున్న నారయణను పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top