పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి..


బూర్గంపహాడ్‌: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్న సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఇంటి ఎదుట ఓ యువతి మౌన పోరాటానికి దిగింది. తనకు న్యాయం చేసే వరకు ఇక్కడే కూర్చుంటానని అంటోంది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో బుధవారం వెలుగుచూసింది. వివరాలు.. గ్రామానికి చెందిన కేసుబాక ప్రసాద్‌ హైదరాబాద్‌లో ఉంటూ చదువుకుంటున్న సమయంలో ఏటపాక మండలం రాఘవపురం గ్రామానికి చెందిన ఓ యువతి(22) తో పరిచయం ఏర్పడింది.



నర్సింగ్‌ చదువుతున్న ఆ యువతితో పరిచయం పెంచుకున్న ప్రసాద్‌ ప్రేమ పేరుతో ఆమెకు మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరు ఒకే గదిలో ఉంటూ సహజీవనం చేశారు. సీఐఎస్‌ఎఫ్‌ ఉద్యోగం సంపాదించిన ప్రసాద్‌ ప్రస్తుతం కర్ణాటకలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో తాను ప్రేమించిన యువతిని మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు యత్నించాడు. అది తెలుసుకున్న ప్రియురాలు అక్కడికి చేరుకొని పెళ్లిని అడ్డుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి ప్రసాద్‌ తప్పించుకొని తిరుగుతుండటంతో పాటు ఫోన్‌లో కూడా అందుబాటులోకి రాకపోవడంతో.. ఆమె నేడు బూర్గంపహాడ్‌లోని ప్రసాద్‌ ఇంటి ముందు దీక్షకు దిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top