చిన్నాయి గూడెంలో చైన్ స్నాచింగ్
తిప్పర్తి (నల్లగొండ జిల్లా) : తిప్పర్తి మండలం చిన్నాయి గూడెంలో సోమవారం చైన్ స్నాచింగ్ జరిగింది. గ్రామానికి చెందిన బైరగొని రాజేశ్వరి అనే మహిళపై దాడి చేసి 4 తులాల బంగారు గొలుసు ఎత్తుకెళ్లారు. ఆమె వ్యవసాయ పనులకు వెళ్తుండగా వెనుక నుంచి బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును దొంగిలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.