‘మర్యాదరామన్న’లకు సర్టిఫికెట్లు
హైదరాబాద్: రిసెప్షన్ అండ్ పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను లా అండ్ ఆర్డర్ పోలీసులు సమర్థంగా అమలుచేస్తున్నారని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి అన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి పిటిషన్లు వేసేందుకు సహకరిస్తున్న ఆరు లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్ల అధికారులకు బషీర్‌బాగ్‌లోని హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో అప్రిసియేషన్ సర్టిఫికెట్లు అందించారు.
వీరిలాగే ఇతర పోలీసు స్టేషన్ అధికారులు కూడా ఈ సిస్టమ్‌ను మరింత మెరుగ్గా అమలుచేయాలన్నారు. ఈ సర్టిఫికెట్లు అందుకున్న వారిలో కలపతర్, గోపాలపురం, అబిడ్స్ రోడ్డు, కామాటిపుర, తిరుమలగిరి, కాంచన్‌బాగ్ పోలీసు అధికారులు ఉన్నారు.