ఘనంగా వైఎస్ విజయమ్మ జన్మదిన వేడుకలు
కాజీపేటరూరల్ : హన్మకొండ హౌసింగ్‌బోర్డు కాలనీలోని వరంగల్ అర్బన్ జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయంలో బుధవారం దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్.విజయమ్మ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగాల ఈర్మియా ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కేక్ కట్‌చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు ఈర్మియా మాట్లాడుతూ విజయమ్మ ఆయురారోగ్యాలు కలిగి ఉండాలని వేడుకున్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు జన్ను విల్సన్‌రాబర్ట్, నెమలిపురి రఘు, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్, జిల్లా సంయుక్త కార్యదర్శి బొచ్చు రవి, ధర్మసాగర్ మండలాధ్యక్షుడు సయ్యద్ ఖాసీం పాషా, జిల్లా నాయకుడు చిర్ర అనిల్ పాల్గొన్నారు.