'ఎనీవేర్‌' తో ఎన్నెన్నో అక్రమాలు

'ఎనీవేర్‌' తో ఎన్నెన్నో అక్రమాలు - Sakshi


సాక్షి,సిటీ బ్యూరో : రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపుల శాఖ లో కంచే చేను మేసింది. ప్రజలకు సౌలభ్యం కోసం ప్రవేశ పెట్టిన ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సబ్‌ రిజిస్ట్రార్లు అవినీతి మయంగా మార్చివేశారు. నాలుగేళ్లలో సుమారు వేల కోట్ల విలువల ప్రభుత్వ నిషేధిత భూములు యథేచ్చగా రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. మరోవైపు తమకున్న విచక్షణ అధికారాలు సైతం అడ్డం పెట్టుకొని నిర్ధేశిత ధర విలువను తగ్గించి స్టాంప్‌ డ్యూటీ కింద పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ఫలితంగా సబ్‌రిజిస్ట్రార్లకు కాసుల వర్షం కురిసింది.



ఆది నుంచి ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వివాదాస్పదంగా మారినప్పటికి నామమాత్రపు చర్యలతో అవినీతి అధికారులు మరింత రెచ్చిపోయారు. క్షేత్ర స్ధాయి నుంచి ఉన్నత స్ధాయి వరకు ఆమ్యామ్యాలు కారణంగా ఎనీవేర్‌ అడిందే అట పాడిందే పాట తయారైంది. గత రెండేళ్ల క్రితం నగర శివారులోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఎనీవేర్‌ కింద జరిగిన రిజిస్ట్రేషన్ల పై అవినీతి ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు విచారణ కమిటీ వేసి కాగితాలకు పరిమితం చేశారు. ఇప్పటి వరకు విచారణ కమిటీ ఎలాంటి నివేదిక సమర్పించలేదంటే పరిస్ధితిని అర్ధం చేసుకోవచ్చు. మంత్రి పేషి నుంచి జిల్లా రిజిస్ట్రార్‌ వరకు ఎనీ వేర్‌ కింద వచ్చిన ఫిర్యాదులు తొక్కి పెడుతూ వచ్చారనే ఆరోపణలు సర్వత్రా వినవస్తున్నాయి.



సీఎంవో కదిలికతోనే...

సాక్షాత్తు ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి సారించనంత వరకు ఎనీవేర్‌ దందా అక్రమాల అడ్టుకట్ట లేకుండా పోయింది. కూకట్‌ పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రావు, ఎల్‌బీనగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ రమేష్‌చంద్రారెడి, బాలనగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ మహ్మద యూసుఫ్‌లపై ఫిర్యాదులు బహిరంగ రాహస్యమైనప్పటకి ఫలితం లేకుండా పోయింది. సీఎంవో స్పందించి ఆదేశాలు జరీ చేసేంత వరకు రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంప్‌ల శాఖలో చలనం లేకుండా పోయింది. అతర్వాత ఉన్నతాధికారులు హడావుడిగా సెస్పెండ్‌ చేసి క్రిమినల్‌ కేసుల పెట్టారు. సీఎంఓ నుంచి ఫిర్యాదులు అంది సెస్పెండ్‌ అయ్యే వరకు సదరు మంత్రి దృష్టికి రాకపోవడం గమనార్హం. మియామూర్‌లో సుమారు 693 ఎకరాలు, బాలనగర్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, కుత్బుల్లాపూర్‌ లలో సైతం వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఎనీవేర్‌ కింద రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలుస్తోంది.



85 శాతం అక్రమాలే..

ఎనీవేర్‌ కింద నమోదైన దస్తావేజుల్లో సుమారు 85 శాతం వరకు అక్రమాలు జరిగి ఉండవచ్చని సాక్షాత్తు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టి నాలుగేళ్ళలో మొత్తం మీద 40 లక్షల వరకు దస్తావేజులు నమోదు కాగా, అందులో నాలుగున్నర లక్షల వరకు ఎనీవేర్‌ ప్రక్రియ కింద నమోదైనట్లు అధికార గణాంకలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కేవలం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 11.01 లక్షల దస్తావేజులకు గాను ఎనీవేర్‌ కింద 1.97 లక్షలు దస్తావేజులు నమోదయ్యాయి. ఎనీవేర్‌ నమోదు లో వరంగల్, హైదరాబాద్‌లలో సైతం 19 శాతం తగ్గకుండా నమోదైనట్లు గణాంకలు స్పష్టం చేస్తున్నాయి.

నాలుగేళ్లలో ఎనీవేర్‌ కింద దస్తావేజుల నమోదు ఇలా....

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

జిల్లా మొత్తం                దస్తావేజులు         ఎనీవేర్‌ దస్తావేజులు     శాతం

–––––––––––––––––––––––––––––––––––––––––––––––

ఆదిలాబాద్‌                 1,70,440           4,714                       2.77

హైదరాబాద్‌                2,25, 265          44,305                   19.69

నల్లగొండ                   4,86, 501          42,767                     8.79

మెదక్‌                      3,74,942            23,763                     6.34

మహబూబ్‌నగర్‌       5.15.640            39,907                     7.74

ఖమ్మం                    2,16, 291         22,526                      10.41

రంగారెడ్డి                 11,01,550         1,97,570                  17.94

కరీంనగర్‌               3.27,093           17,496                       5.35

నిజామాబాద్‌          2,42,531           5,952                         2.45

వరంగల్‌                2,67897             53,546                     19.99

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top