చాక్‌పీస్‌పై నిమిషంలో 12 చిత్రాలు

పి.మాద్విక

  • గిన్సిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో మాద్విక

  • కరీంనగర్: కరీంనగర్‌కు చెందిన పి.మాద్విక(13) ఒక నిమిషంలో చాక్‌పీస్‌పై ఏకంగా 12 వినాయక చిత్రాలను వేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. కరీంనగర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో మాద్విక తన ప్రతిభను ప్రదర్శించింది. ఆమె గతేడాది ఫిబ్రవరిలో ఇదే తరహాలో వినాయక చిత్రాలను చెక్కి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. అదే సమయంలో గిన్నిస్ బుక్‌కు దరఖాస్తు చేసుకుంది.



    ఈ మేరకు గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో సోమవారం మాద్విక ఈ విజయాన్ని సాధిం చింది. పోలీస్‌శాఖలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న పి.శశిధర్ కుమార్తె అయిన మాద్విత చిన్ననాటి నుంచి వింతలు, విశేషాలపై ఆసక్తి చూపేది. కానిస్టేబుల్ రాజశేఖర్ వద్ద శిక్షణ తీసుకుని చిత్రకళలో రాణిస్తోంది.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top