తెలంగాణ కేబినెట్ భేటి నిర్ణయాలు!


హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. కేబినెట్ సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. 

 

మైక్రో ఇరిగేషన్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయింపు చేపట్టినట్టు,  ఈ పథకం కింద ఎస్సీ, ఎస్ టీ వర్గాలకు చెందిన రైతులకు 100 శాతం సబ్సీడి, చిన్న సన్నకారు రైతులకు 90 శాతం సబ్బిడీ ఉంటుందన్నారు. విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న రైతులకు లీటర్ 4 రూపాయల చొప్పున ధరను పెంచినట్టు కేసీఆర్ తెలిపారు. అలాగే 1000 ఎకరాల్లో 252 కోట్ల వ్యయంతో పాలీ హౌస్ ల నిర్మాణం చేపడుతామని కేసీఆర్ వివరించారు. 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top