ఆశలు ఆవిరే..

ఆశలు ఆవిరే.. - Sakshi


- గుత్ప ఎత్తిపోతల ద్వారా గోదావరిలోకి చేరని నీరు

- 38,792 ఎకరాల సాగు ప్రశ్నార్థకమే

- రైతుల జీవితాల్లో మళ్లీ అంధకారం

నందిపేట :
ప్రతి ఆయకట్టుకు సాగునీరందించాలనే లక్ష్యంతో దివంగత మఖ్యమం త్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన గుత్ప ఎత్తిపోతల పథకం ప్రస్తుతం నిర్వీర్యమవుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ తీరంలోని నందిపేట మండలం ఉమ్మెడ శివారులో గోదావరి నదిని ఆనుకుని నిర్మించిన అర్గుల్ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం ద్వారా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో పంటలకు చుక్క నీరందే పరిస్థితి లేదు. 8 సంవత్సరాల పాటు రైతులకు సాగునీరందించిన ఈ పథకానికి.. ఇప్పుడు గోదావరిలో ప్రవాహం పూర్తిగా సన్నగిల్లడంతో నీటి సరఫరా నిలిచిపోరుుంది. దీంతో తొలిసారిగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఈ ఎత్తిపోతల ద్వారా ఆయకట్టు పంటలకు సాగు నీరు విడుదల కాలేదు.

 

గుత్పతో సస్యశ్యామలం..


ఎనిమిది సంవత్సరాలుగా గుత్ప ఎత్తిపోతల ద్వారా 540 క్యూసెక్కుల నీటిని తోడి రైతులకు నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ద్వారా 38,792 ఎకరాలకు సాగునీరందించారు. దీంతో నందిపేట, మాక్లూర్, బాల్కొండ, జక్రాన్‌పల్లి, వేల్పూర్, ఆర్మూర్ మండలాల పరిదిలోని 55 గ్రామాలలో పంటలు సాగయ్యూయి. ఫలితంగా ఎన్నో ఎళ్లుగా బీడుగా ఉన్న భూములు పంట పొలాలుగా మారాయి. దుర్భర జీవితాలు గడుపుతున్న ైరె తుల కుటుంబాలలో ఈ పథకం వెలుగులు నింపింది.

 

ఈ ఏడాది సాగు ప్రశ్నార్థకమే..


 ప్రస్తుత ఖరీఫ్ సీజన్ జూన్‌లోనే ప్రారంభమైనా, ఇంతవరకు సరైన వర్షాలు కురియక పోవడం, గోదావరి ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఆ నది నీటి ప్రవాహం లేక గుత్ప ఎత్తిపోతల పథకం ఉత్సవ విగ్రహంలా మారింది. దీంతో దీని పరిధిలోని 38,792 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది.  మరోవైపు భూగర్భ జలాలు సైతం అడుగంటి పోవడంతో వందల సంఖ్యలో బోరుబావులు సైతం ఎండిపోయూరుు.   జూలై మొదటి వారంలోనే భూగర్భ జలాలు దిగువకు పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.



సేద్యమే ప్రధాన ఆధారంగా ఉన్నందున అనేక మంది రైతులు కొత్తగా 200-300 అడుగుల లోతు వరకు బోర్లు తవ్విస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుత్ప ఆయకట్టు పరిధిలో కనీసం 30 శాతం విస్తీర్ణంలో కూడా వరి నాట్లు పడలేదు. పదేళ్ల క్రితం గోదావరి నది పూర్తిగా ఎండిపోయిందని, తిరిగి ఇప్పుడు అలాంటి పరిస్థితే పునారవృతం అవుతోందని ఈ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీసారి ఖరీఫ్, రబీ సీజన్‌లలో వరినాట్లు వేసుకునేందుకు ముందస్తుగానే ఒక దఫా గుత్ప ఎత్తిపోతల ద్వారా నీటిని విడుదల చేసేవారు. దాంతో ఆయకట్టు రైతులు ఆ నీటిని తమ పొలాల్లోకి మళ్లించుకుని జోరుగా వరినాట్లు వేసేవారు. అలాంటిది ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారు కావడంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోరుుంది. సాగునీటి మాటెలా ఉన్నా కనీసం తాగునీటికి కూడ తిప్పలు తప్పేలా లేవని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top