2019 నాటికి తిరుగులేని శక్తిగా బీజేపీ


ఆత్మకూర్‌(ఎస్‌) :రానున్న 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదిగి యూపీలో మాదిరిగా అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం మండలంలోని కందగట్ల గ్రామంలో గడపగడపకూ బీజేపీ కార్యక్రమానికి చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపడుతున్న సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రభుత్వం తగిన సహకారం అందించడం లేదన్నారు.



ఈ నేపథ్యంలో మూడేళ్ల పాలనలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయడం కోసమే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు కర్నాటి కిషన్, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఉపేందర్, ఎంపీటీసీ సకినాల శ్రీనివాస్, పీఏసీఎస్‌ డైరెక్టర్లు మర్ల చంద్రారెడ్డి, హేమ్లానాయక్, పార్టీ నాయకులు  లింగరాజు, రాంరెడ్డి,  వెంకన్న, వెంకట్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, నర్సిరెడ్డి, దొండ యల్లయ్య పాల్గొన్నారు.



‘మోదీ’ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి

పెన్‌పహాడ్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొణతం సత్యనారాయణరెడ్డి అన్నారు. ధీనదయాల్‌  శతజయంతిని పురస్కరించుకుని బుధవారం దూపహాడ్‌ గ్రామంలో నిర్వహించిన ఇంటింటి కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు దొంగరి యుగేంధర్, నల్లగొండ నియోజకవర్గ కన్వీనర్‌ కర్నాటి కిషన్, జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ఉపేందర్, పిన్నెని సత్తెమయ్య, కీత సత్తెమయ్య, భగత్,  చంద్రం, నర్సింహరావు,  నరేష్, యాదగిరి, సైదయ్య  పాల్గొన్నారు.  



పేదల సంక్షేమమే ‘మోదీ’ ధ్యేయం

సూర్యాపేటరూరల్‌ : పేదల సంక్షేమమే ద్యేయంగా ప్రధాని నరేంద్రమోదీ పాలన సాగుతోందని బీజేపీ సూర్యాపేట మండల ఇన్‌చార్జి నల్లగుంట్ల అయోధ్య అన్నారు. బుధవారం మండలంలోని రామన్నగూడెం గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఇంటింటి  ప్రచారం నిర్వహించి మాట్లాడారు.  కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పు శ్రీనివాస్, జిల్లా నాయకులు అనంతుల వాసుదేవరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు తౌడోజు సలేంద్రచారి, బీజేవైఎం మండల అధ్యక్షుడు రాగం విజయ్‌యాదవ్, నాయకులు పాపయ్య, సురేష్, వెంకన్న పాల్గొన్నారు.



ఇంటింటికీ బీజేపీ నాయకులు

సూర్యాపేట అర్బన్‌ : కేంద్ర పథకాలను ప్రజలకు తెలియజేస్తూ  బుధవారం పట్టణంలోని 5, 14వ వార్డుల్లో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమములో సలిగంటి వీరేంద్ర, పాండురంగాచారి, ఏడుకొండలు, వెంకట్‌రెడ్డి, కోతి మాధవి, మధుసూదన్‌రెడ్డి, అనంతుల యాదగిరి, శ్రీను, క్రాంతిరెడ్డి, సతీష్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top