బస్సేది..?

బస్సేది..?


పాలమూరు : సాంకేతిక పురోగతి ఎంత సాధించినా.. గ్రామీణ ప్రాంత ప్రజలు నేటికీ బస్సుల సౌకర్యం అవస్థలు పడాల్సి వస్తోంది. పల్లెవెలుగు పేరుతో అన్ని గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్‌టీసీ సంస్థ చెబుతున్నా అందుకు తగిన విధంగా పల్లెలకు బస్సులను నడపడం లేదు. ఇదే అదునుగా భావించిన ప్రైవేటు వాహనాల యజ మానులు ప్రయాణికులను కిక్కిరిసినట్టుగా కూర్చోబెట్టి ప్రమాదాలకు కారణమవుతున్నారు.



జిల్లా వ్యాప్తంగా మహబూబ్‌నగర్, షాద్‌నగర్, కల్వకుర్తి, షాద్‌నగర్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్ డిపోల పరిధిలో 980 వరకు బస్సులున్నాయి. అయినా జిల్లాలోని 400కి పైగా మారుమూల గ్రామాలకు బస్సులు నడపడం లేదు. ఆర్టీసీ బస్సులు జిల్లాలో ప్రతినెల 80 లక్షల 45వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుండగా నెల సరి ఆదాయుం జిల్లాలో దాదాపు 18.50కోట్ల వరకు వస్తున్నట్లు అంచనా.. అయితే ఆదాయ మార్గాలు సక్రమంగా లేని కారణంగా గ్రామీణ ప్రాంతాలకు బ స్సులను నడపడం లేదని ఆర్టీసీ సంస్థ చెబుతోంది.



బస్సులు సరిగా లేకపోవడంతో పట్టణాల్లోని విద్యాలయాల్లోకి వెళ్లేందుకు విద్యార్థులు బస్ స్టాప్‌ల వద్ద  గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెల కొంది. వచ్చిన బస్‌ల టాప్‌పైకి ఎక్కడమే కాకుండా, ఫుట్ బోర్డులపై నిలబడి ప్రమాదకర ప్రయాణం కొ నసాగిస్తున్నారు. ఈ పరిస్థితిపై ‘సాక్షి’ సోమవారం జిల్లావ్యాప్తంగా ప్రయాణికుల కష్టాలను విజిట్ చేసింది.



జిల్లాలో ప్రధానంగా కల్వకుర్తి నియోజకవర్గం లోని పలు గ్రామాలు, తండాలకు రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికి బస్సులను నడిపించడంలో ఆర్టీసీ అధికారులు విఫలమవుతున్నారు. కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల విద్యార్థులు బస్సు సౌకర్యం కల్పించాలని ధర్నాలు, రాస్తారోకోలు చేసి నా ఆర్టీసీ అధికారులు తగిన చర్యలు చేపట్టడం లే దు. బల్మూర్-లింగాల రూట్లలో ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువగా ఉండడం, నడిచే బస్సులు ఎక్కడ మొరాయిస్తాయో తెలియని పరిస్థితి. సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు ప్రైవే టు వాహనాలను ఆశ్రయిస్తూ అష్ట కష్టాలు పడుతున్నారు.



అవి కూడా సమయపాలన పాటించని కారణంగా చిన్నారుల చదువులకు ఆటంకం ఏర్పడుతోం ది. వీపనగండ్ల మండలంనుంచి పెంట్లవెల్లి మీదుగా కొల్లాపూర్‌కు ప్రతిరోజూ 200మందికి పైగా విద్యార్థు లు వస్తుంటారు. సాయంత్రం షటిల్ బస్సులు రాకపోవడంతో కర్నూల్, ఆత్మకూర్, గద్వాల బస్సుల్లో అవస్థ పడుతూ ఇళ్లకు చేరుకుంటున్నారు. షాద్‌నగ ర్, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర, వనపర్తి ని యోజకవర్గాల పరిధిలోని చాలా గ్రామాలకు సరైన బస్సు సౌకర్యాల్లేవు.



అరకొరగావచ్చే బస్సుల్లో ఒక్కోదాంట్లో 150కిపైగా విద్యార్థులు కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. విద్యార్థులు ఉదయం పాఠశాలకు వెళ్లి సా యంత్రం ఇంటికి వచ్చేవరకు వారికోసం తల్లితండ్రు లు ఆందోళనగా ఎదురుచూస్తున్నారు. కొన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో పేద విద్యార్థు లు ప్రతిరోజు సొంతంగా ఖర్చులు పెట్టుకొని ఆటో లు, జీపుల్లో వెళ్తున్నారు. విద్యార్థులకు ప్రభుత్వం రాయితీ ఆర్‌టీసీ బస్‌పాస్‌లను ఇచ్చినా తగిన సదుపాయాల్లేక జిల్లాలోని విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

 

 ఆర్టీసీ బస్సుల రవాణా ఇలా...

 

 డిపో            మొత్తం        బస్సువెళ్లని

                 గ్రామాలు        గ్రామాలు

 అచ్చంపేట         105              55

 గద్వాల             215              40

 కల్వకుర్తి         190              50

  కొల్లాపూర్           85              50

 మహబూబ్‌నగర్     160              35

 నాగర్‌కర్నూల్     165              45

 వనపర్తి             165              45

 నారాయణపేట     145              55

 షాద్‌నగర్          125              55

 

సాధ్యమైంతవరకు బస్సులు నడుపుతున్నాం

గ్రామీణ సర్వీసుల నిర్వహణపై మాసంస్థ ప్రత్యేక దృష్టి నిలుపుతోం ది. విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని పల్లెవెలుగు బ స్సులను అధిక సంఖ్యలో నడుపుతున్నాం. ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు 65శాతం కన్నా తక్కువ ఆదా యం వస్తే వాటి నిర్వహణను నిలిపేస్తున్నాం. గ్రామీణ సర్వీసులను మాత్రం 45 శాతం ఆదా యం ఉన్నా కొనసాగిస్తున్నాం. సాధ్యమైనంత వరకు గ్రామీణ రూట్లలో బస్సులు నడుపుతూ ప్రజలకు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం.

 - ఆర్.గంగాధర్, ఆర్‌టీసీ ఆర్‌ఎం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top