పెళ్లింట్లో విషాదం


 పచ్చని పందిరి.. మావిడాకుల తోరణాలు.. బంధువుల కోలాహలం... ఓ జంటను మూడుముళ్లతో ఒక్కటి చేశామన్న ఆనందోత్సహాలు ఆ ఇంట్లో వెళ్లివిరి శాయి.. తమ కుమార్తెను ఓ అయ్య చేతిలో పెట్టామన్న సంతోషంలో తల్లిదండ్రి.. అంతా సవ్యంగా సాగిపోతుండగా.. విధి వక్రించింది.. వివాహం అనంతరం స్వగ్రామానికి బయలుదేరిన వధువు సోదరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో పెళ్లింట్లో విషాదం అలుముకుంది.

 - మిర్యాలగూడ టౌన్/నేరేడుచర్ల

 

  మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లి గ్రామానికి చెందిన నేరేళ్ల మట్టయ్య, ధనమ్మల కుమార్తె కళ్యాణి వివాహం గరిడేపల్లి మండలం గడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తితో శుక్రవారం వరుడి ఇం టి వద్దజరిగింది. వివాహం అనంతరం వధువు సోదరుడు నాగరాజు (19) అతడి స్నేహితులు దువ్వల నాగేందర్, రఫీతో కలిసి రాత్రి ఆటోలో యాద్గార్‌పల్లికి బయలుదేరాడు. మార్గమధ్యలో నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి వద్ద ఎదురుగా వస్తున్న  లారీ ఆటోను ఢీకొట్టడంతో నాగరాజు అతడి స్నేహితుడు నాగేందర్ తీవ్ర గాయాలవ్వగా, రఫీ స్వల్పంగా గా యపడ్డాడు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో నాగరాజు మృతిచెందాడు. నాగేందర్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నాగ రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ట్లు ఏఎస్‌ఐ సాగర్‌రావు తెలిపారు.

 

 ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు

 రోడ్డు ప్రమాదంలో వధువు సోదరుడు మృతిచెందాడనే విషయం తెలియగానే పెళ్లింట్లో విషాదం అలుముకుంది. బంధు మిత్రులంతా మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలివచ్చారు. అప్పటి వరకు పెళథ్లి వేడుకలో ఆనందంగా గడిపిన యువకుడు విగతజీవిగా కనిపించడంతో బంధువుల రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లిదండ్రి రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. మి ర్యాలగూడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇం టర్ పూర్తి చేసిన నాగరాజు మృ చెందాడన్నవ ఇషయం తెలుసుకుని అత డి స్నేహితులు కూడా పెద్ద సంఖ్యలో ఆస్పత్రికి వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు.

 

 మృతుడి కుటుంబానికి పరామర్శ

 రోడ్డు ప్రమాదంలో నేరేళ్ల నాగరాజు చనిపోవడంతో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షు డు గాయం ఉపేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తె లుసుకున్నారు.  నిత్యం అందరితో కలిసిమెలిసి ఉండే నాగరాజు ఆకాల మృతి దురదృష్టకరంగా ఉందన్నారు. చదువులో మంచి ప్రతిభ కలిగిన నాగరాజు  చనిపోవడం కలిచి వేసిందన్నారు. ఆయన వెంట నాగిరెడ్డి వెంకటరెడ్డి, ఆంజనేయులు, గిరి, షరీఫ్, కాశీరాం ఉన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top