బీజేపీ నేతలకు సైద్ధాంతిక శిక్షణ

బీజేపీ నేతలకు సైద్ధాంతిక శిక్షణ - Sakshi


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర బీజేపీ నాయకులకు సైద్ధాంతిక అంశాలపై పునశ్చరణ తరగతు లను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పార్టీ సంస్థాగతంగా బలపడేందుకు అనుసరించా ల్సిన వ్యూహంపైనా ఈ శిక్షణ సందర్భంగా పార్టీ జాతీయ నాయకత్వం ప్రత్యేకదృష్టి పెట్టనుంది. జాతీయస్థాయిలో ముఖ్యంగా గుజరాత్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కృషి చేసిన వారి ద్వారా రాష్ట్ర నాయకులకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయించనున్నారు.



 రాష్ట్రవ్యాప్తంగా 400 మందికి పైగా నాయకులకు గురువారం నుంచి 4 రోజుల పాటు హైదరాబాద్‌ శివార్ల లోని ఆర్వీకే పాఠశాలలో విస్తృతస్థాయిలో ఆయా అంశాలను బోధించనున్నారు. ఈ నాలుగురోజుల పాటు వారు అక్కడే బస చేయాలి. రాష్ట్ర పార్టీ పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర స్థాయిలోని వివిధ కమిటీల చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, జిల్లాపార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఈ శిక్షణ తరగతులకు హాజరుకానున్నారు. గతంలో పార్టీకి అంతగా పట్టులేని ఒడిశాలో అధికారపార్టీ తర్వాతి స్థానంలోకి బీజేపీని తీసుకొచ్చేలా కృషి చేసిన సావధాన్‌సింగ్‌ సంస్థాగత అంశాలు, వ్యూహ రచనలపై మెళకువలను అందించనున్నారు.



ఒడిశా తర్వాత తెలంగాణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎక్కువగా దృష్టి కేంద్రీ కరిస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా బలపడేందుకు పోలింగ్‌ బూత్‌స్థాయి కమి టీల ఏర్పాటు, కేంద్ర పథకాల ప్రచారం, కేంద్రం నుంచి రాష్ట్రానికి పలు పథకాల ద్వారా అందుతున్న సహాయం, మోదీ అభివృద్ధి నినాదాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జాతీయ అధినాయకత్వం ఇక్కడి నేతలకు నిర్దేశించింది. ఈ పరి ణామాల దృష్ట్యా ప్రస్తుత శిక్షణ తరగతులకు ప్రాధాన్యం ఏర్పడింది. పార్టీ జాతీయ సంస్థా గత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సతీష్‌జీ, రాష్ట్రపార్టీ ఇన్‌చార్జీ కృష్ణదాస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, ఇతర నేతలు మహేశ్‌చంద్ర శర్మ, వినయ్‌ సహస్ర బుద్దే ఆయా అంశాల బోధనకు ఇక్కడకు రానున్నట్లు పార్టీవర్గాల సమాచారం.



కిందిస్థాయి నుంచి బలోపేతం

పార్టీ చరిత్ర, సైద్ధాంతిక భూమిక, క్రమశిక్షణ, సాంస్కృతిక జాతీయవాదం వంటి సిద్ధాంత పర అంశాలపై నాయకులకు తరగతులను నిర్వహిస్తారు. పార్టీ వృద్ధికి, ప్రచారానికి సోషల్‌ మీడియా తదితర రంగాలను ఉప యోగించుకోవడంపై ప్రత్యేక దృష్టిని పెట్టనున్నారు. పార్టీనాయకులు, కార్యకర్తలు పాటించాల్సిన క్రమశిక్షణ, కార్యకర్తలకు ఉండాల్సిన లక్షణాల గురించి కూలంకశంగా వివరించనున్నట్లు తెలుస్తోంది. జిల్లా, మండల, గ్రామస్థాయిలలో వివిధరంగాలు, ఆయా స్థాయిల్లోని ప్రజలతో సంబంధాలు, రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులను గెలి పించుకునేలా పార్టీ యంత్రాంగాన్ని బలో పేతం చేసుకునేందుకు అవసరమైన కార్యా చరణను రూపొందించడం ఈ శిక్షణ ముఖ్యో ద్దేశమని పార్టీ వర్గాల సమాచారం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top