బీసీ సంక్షేమ శాఖలో బ్రోకర్ల దందా


సంఘ నాయకులే  దళారులు

 వరంలా మారిన  అరకొర బడ్జెట్ విడుదల

 బో‘ధనం’ ఇప్పిస్తామంటూ కళాశాలలతో బేరాలు

 పర్సెంటేజీలు వసూళ్లు


 

 బీసీ సంక్షేమ శాఖలో బ్రోకర్ల దందా శ్రుతి మించుతోంది. ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు ప్రభుత్వం అరకొర నిధులు కేటాయించడాన్ని అదునుగా తీసుకుంటున్న బ్రోకర్లు.. ముందుగా  మీ కళాశాలలకే డబ్బులు ఇప్పిస్తామంటూ బేరసారాలకు దిగుతున్నారు. ఆయూ కళాశాలల నుంచి లక్షలు వసూలు చేస్తున్నారు. తాము సూచించిన కళాశాలలకే బడ్జెట్ కేటాయించాలంటూ సంక్షేమ శాఖ ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారు. వినకపోతే బెదిరింపులకు సైతం పాల్పడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అరకొర నిధులు టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లకు పూర్తి బడ్జెట్ కేటాయింపులు జరగలే దు. దీంతో రూ.వందల కోట్ల బకారుులు పేరుకుపోయాయి. 2014-15 విద్యాసంవత్సరానికి సంబంధించి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ (ఆర్‌టీఎఫ్) కింద రూ.37.19 కోట్లు జిల్లాకు విడుదల చేశారు. ఈ నిధులతో 63,302 మంది విద్యార్థులకు మాత్రమే ఫీజు చెల్లించగలిగారు. ఇంకా 35,939 మంది విద్యార్థులకు రూ.60.87 కోట్ల బకాయిలు జిల్లాకు రావాల్సి ఉంది. 2015-16 విద్యాసంవత్సరానికి 1,01,770 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, రూ.94.47 కోట్లు అవసరం. స్కాలర్‌షిప్(ఎంటీఎఫ్)కు రూ. 21.20 కోట్లు విడుదల కాగా, 2014-15 సంవత్సర బకాయిలు రూ.13.80 కోట్లు రావాల్సి ఉంది. 42,298 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు చెల్లించగా, 56,943 మంది విద్యార్థులు స్కాలర్‌షిప్ కోసం ఎదురుచూస్తున్నారు. 2015 -16 సంవత్సరానికి 1,01,770 మంది విద్యార్థులకు రూ.40.07కోట్లు రావాల్సి ఉంది. మొ త్తంగా 2,03,540 మంది విద్యార్థులకు రూ. 134.54 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈబీసీలకు రూ.5.37 కోట్లు ప్రభుత్వం విడుద ల చేయగా, 3592 మంది విద్యార్థులు లబ్ధిపొం దారు. 2014-15 సంవత్సరానికి 4429 మంది విద్యార్థులకు రూ.11.33 కోట్లు రావాల్సి ఉం ది. 2015-16 సంవత్సరానికి 7668 మంది వి ద్యార్థులకు రూ.14.93 కోట్లు రావాల్సి ఉంది.



 బ్రోకర్ల రంగ ప్రవేశం

 ఫీజు రీరుుంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల బకాయిలు పెద్ద మొత్తంలో రావాల్సి ఉండగా, ప్ర భుత్వం ఏకమొత్తంలో కాకుండా అరకొరగా ని ధులు కేటాయిస్తోంది. చాలీచాలని బడ్జెట్ కేటాయిస్తుండటాన్ని అదునుగా తీసుకొని బ్రోకర్లు రంగ ప్రవేశం చేశారు. వచ్చిన అరకొర నిధులను కళాశాలలకు కేటాయించాలంటే తమకు ఒకటి నుంచి రెండు శాతం డ బ్బులు ఇవ్వాలంటూ బేరసారాలకు దిగుతున్నారు. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులే దళారులుగా అవతారమెత్తి ఈ దందాను నడిపిస్తున్నారనే ఆరోపణలున్నారుు. ఒక కళాశాలతో బేరం కుదిరితే.. ఆ కళాశాలకు బడ్జెట్‌ను కేటాయించాలంటూ బీసీ సంక్షేమ శాఖ అధికారులపై ఒత్తిడి తెస్తారు. వారు సదరు కళాశాలకు బడ్జెట్ కేటాయిస్తే.. అందులో నుంచి ఒకటి నుంచి రెండు శాతం వాటాలు అందుకుంటారు. అంటే ఒక కళాశాలకు రూ.కోటి బడ్జెట్ అవసరమైతే, రూ.లక్ష నుంచి రూ.2లక్షలు తీసుకొని నిధులు కేటాయించేట్లు చేస్తారు. ఒకవేళ తాము చెప్పిన కళాశాలకు బడ్జెట్ కేటాయించకపోతే లేనిపోని ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని అధికారులు వాపోతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ బ్రోకర్ల దందాపై దృష్టిసారించి నియంత్రిస్తే తప్ప అర్హులకు లాభం చేకూరే అవకాశం కనిపించడం లేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top