దశలవారీగా బీబీనగర్ నిమ్స్ అభివృద్ధి

దశలవారీగా బీబీనగర్ నిమ్స్ అభివృద్ధి


త్వరలో 300 పడకల ఆస్పత్రిగా మారుస్తాం కాంట్రాక్టర్‌తో తలెత్తిన

సమస్యల కారణంగా వైద్య సేవల ప్రారంభంలో జాప్యం నిమ్స్ భవనాన్ని పరిశీలించిన

 రాష్ట్రవైద్య ఆరోగ్యశాఖమంత్రి లక్ష్మారెడ్డి




 బీబీనగర్ : మండలంలోని రంగాపురం పరిధిలో గల నిమ్స్ యూనివర్సిటీని దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీహెచ్ లక్ష్మారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన బెంగళూరు నుంచి నేరుగా బీబీనగర్ చేరుకుని నిమ్స్ భవనాన్ని  మొదటి పేజీ తరువాయిపరి శీలించారు. ఇందు లో వసతులు, చేపట్టాల్సిన నిర్మాణాపై నిమ్స్ వైద్యులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. త్వరలోనే 300 పడకల ఆస్పత్రిగా మార్చి వైద్య కళాశాలను అందుబాటులోకి తేస్తామని చెప్పారు. బెంగళూరులోని జైదేవా ఆస్పత్రిని పరిశీలించామని ఆ తరహాలో దీనిని తీర్చిదిద్దుతామన్నారు. నిమ్స్ భవన నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్‌తో తలెత్తిన సమస్యల కారణంగానే జాప్యం జరగడంతో ఇన్ని రోజలుగా నిమ్స్‌లో వైద్య సేవలు ప్రారంభంకాలేకపోయాయన్నారు. ఓపీ సేవలు ప్రారంభించనున్నందున రోగులకు ఎలాంటి ఇబ్బందులు కగలకుండా ఉండేందుకు వైద్యాధికారు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.





 169 మంది సిబ్బందితో ఓపీ విభాగం

 నిమ్స్‌లోని ఓపీ విభాగాన్ని 169మంది సిబ్బందితో ప్రారంభించనున్నట్లు నిమ్స్ డిప్యూటీ డెరైక్టర్ కేటీరెడ్డి తెలిపారు. సిబ్బంది కోసం కొత్తగా ఎలాంటి రిక్రూట్‌మెంట్‌లు జరపలేదని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో గల వైద్యులను, పారా మెడికల్, సిబ్బందిని ఇక్కడ నియమిస్తామన్నారు. ఓపీలోని వైద్య సేవలను ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిస్తామని, పరిస్థితులను బట్టి సమయాన్ని పొడిగించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ లక్ష్మారెడ్డి, నిమ్స్ వైద్యులు మహేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎరుకల సుధాకర్‌గౌడ్, ఉప సర్పంచ్ అక్బర్, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మీనారాయణ, నరహరి, అంజయ్యగౌడ్, బాల్‌రాజుగౌడ్, అమరేంధర్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top