రాష్ట్రం తీరు వల్లే ఆలస్యం..

రాష్ట్రం తీరు వల్లే ఆలస్యం.. - Sakshi


ఆస్పత్రుల నిర్మాణంపై

కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ  




సాక్షి, హైదరాబాద్‌: కార్మిక వైద్య సేవలు విస్తృతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆది వారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘గోషామహల్‌లో కార్మికుల కోసం కేంద్రం వంద పడకల ఆస్పత్రి మంజూరు చేసింది. రూ.100 కోట్లు కూడా ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ భూమి ఇవ్వలేదు. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. భూమి ఇవ్వాలని ప్రభుత్వంతో మాట్లాడా. ఈ ప్రక్రియ వేగవంతం చేసి త్వరితం గా భూమిని పొజిషన్‌ ఇస్తే పనుల్లో వేగం పెంచుతాం. కార్మికులకు మెరుగైన సేవలందించేందుకు  బీబీనగర్, రామగుండం, కవాడిగూడలలో 50 పడకల ఆస్పత్రులు మంజూరు చేశాం. కొత్తగా 6 పడకల ఆస్పత్రులు, డిస్పెన్సరీలు ఏర్పాటు చేయనున్నాం’ అని వివరిం చారు.


భూకేటాయింపునకు ఆలస్యమైతే అద్దె భవనాలనైనా చూపిస్తే వాటిని ప్రారంభిస్తామన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని 31 జిల్లాల్లో సర్వే చేయాలని సూచిం చినట్లు తెలిపారు. కొత్త ఆస్పత్రుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం, బీజేపీ తరపున వినతులు వచ్చాయని వాటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. గ్రాట్యుటీ అమలుపై వచ్చే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టనున్నామన్నారు. అమెరికాలో కూచి భొట్ల శ్రీనివాస్‌ హత్య బాధాకరమని, జాత్యహం కార దాడులను సహించేది లేదన్నారు. దీనిపై కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌తో మాట్లాడామన్నా రు. శ్రీనివాస్‌ మృతదేహం రెండ్రోజుల్లో నగరానికి చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top