ఒంటరి మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం


ఖమ్మం: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వితంతువుపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరెడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వితంతువుపై కన్నేసిన ఆటోడ్రైవర్ గోగుల రాంబాబు(45) గురువారం అర్ధరాత్రి దాటాక ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడు.



ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top