ఆగస్టు మిస్టరీలు!


  •      నేటికీ పెండింగ్‌లో 13 సంచలనం రేపిన కేసులు

  •      బందోబస్తులు, సదస్సులతో పోలీసులు బిజీగా ఉండటమే కారణం

  • సాక్షి, సిటీబ్యూరో:  గతనెలలో జంట పోలీసు కమిషనరేట్లలో సంచలనం రేపిన పలు కేసులు నేటికీపెండింగ్‌లోనే ఉన్నాయి. నిందితుల ఆచూకీ కనిపెట్టకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. స్వాత ంత్ర దినోత్సవ వేడుకలు, గణేష్ ఉత్సవాల హడావుడి, సీసీ కెమెరాలపై అవగాహన సదస్సులు, శాంతి కమిటీల సమావేశాల్లో పోలీసులు తలమునకలై ఉండటంతో ఈ కేసుల దర్యాప్తుపై దృష్టి పెట్టలేకపోయారు. గతనెలలో జరిగిన 13 ముఖ్య ఘటనల్లో నిందితులు నేటికీ దొరకలేదు. ఇందులో హత్య, దోపిడీ, స్నాచింగ్, దృష్టిమరల్చి, చోరీ తదితర ఘటనలున్నాయి.  

     

    ఈ కేసుల మిస్టరీ వీడేదెన్నడో..

    ఆగస్టు 5: నార్సింగి పరిధిలో అబ్దుల్ రహీం బ్యాంక్ నుంచి రూ.3.50 లక్షలు డ్రా చేసుకుని వెళ్తుండగా దుండగులు అతడి దృష్టి మరల్చి నగదు ఎత్తుకెళ్లారు.

          

    15: శంషాబాద్ చారినగర్‌కు చెందిన రాములును ఎవరో హత్య చేసి గుర్తు పెట్టకుండా శవాన్ని కాల్చేశారు.

         

    కుషాయిగూడ ద్వారకాపురిలో ఒంటరిగా ఉండే లక్ష్మమ్మ (70)పై ఇద్దరు దుండగులు దాడి చేసి బీరువాలో ఉన్న 12 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు.

         

    18: కంచన్‌బాగ్ హఫీజ్‌బాబానగర్‌కు చెందిన బాలిక (15)పై కొందరు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.

     

    20: చంచల్‌గూడలోని సెంట్రల్ ప్రిజన్స్ బంక్ నుంచి రిమాండ్ ఖైదీ సాజిద్ (26) రూ.68,500 తీసుకుని పరారయ్యాడు.

     

    ముషీరాబాద్ పఠాన్‌బస్తీలో ఉండే అనీఫా బేగం (50) ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఆమె కళ్లల్లో కారం చల్లి, నోట్లో వస్త్రాలు కుక్కి ఐదు తులాల బంగారు నగలు, రూ.50 వేలు దోచుకెళ్లారు.

     

    21: బేగంబజార్‌లో ఆటోలో వెళ్తున్న గోల్డ్‌స్మిత్ అలీ (45)పై దుండగులు దాడి చేసి 2 కిలోల బంగారు నగలు దోపిడీ చేశారు.

     

    చైతన్యపురి ఎస్‌బీఐలో గురుశంకర్ అనే వ్యక్తి రూ.9 లక్షలు డ్రా చేసి వెళ్తుండగా ఓ వ్యక్తి అడ్రస్ అడిగినట్టు నటించి స్కూటర్ డిక్కీలోని డబ్బు పట్టుకుపోయాడు.

     

    23: రూ.40 లక్షలు బ్యాంకులో వేసేందుకు బైక్‌పై వెళ్తున్న బావ బావవురుదులు శ్యాంసుందర్, దిలీప్‌కుమార్‌పై పల్సర్‌పై వచ్చిన నలుగురు కత్తితో దాడి చేసి డబ్బు దోపిడీ చేశారు.

     

    26: నాచారం ఎస్వీనగర్‌కు చెందిన సబిత (35) ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు ఆమె కాళ్లుచేతులు కట్టేసి, గొంతు నులిమి చంపేశారు.

     

    28: నల్లకుంట పరిధిలో రాజేందర్ అనే వ్యక్తి తన యజమానికి చెందిన రూ.2.77 లక్షలు బ్యాంక్‌లో వేసేందుకు తీసుకెళ్తుండగా బైక్‌పై వచ్చిన నలుగురు  కళ్లల్లో కారం చల్లి డబ్బు దోచుకెళ్లారు.

         

    నారాయణగూడ పరిధిలో ఫార్మాస్యూటికల్స్ వ్యాపారి ఆర్‌బీ జ్యోషి ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు నగలు ఎత్తుకెళ్లారు.

     

    30: ఛాదర్‌ఘాట్ కాలాడేరాకు చెందిన రహీమ్‌ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా... బీరువాలోని 60 తులాల బంగారు నగలు, రూ.లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు.

     

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top