గర్భిణిని వివస్త్రను చేసిన వ్యక్తుల అరెస్ట్


పరారీలో మరో ముగ్గురు

సీకేఎం ఆస్పత్రికి  బాధితురాలి తరలింపు


 

వర్ధన్నపేటటౌన్ : మానవత్వం మరిచి అనాగరికంగా ఓ గర్భిణీని వివస్త్రను చేసి ఒంటిపై కా ల్చి హత్యాయత్నం చేసిన నిందితులను ఆరుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా ముగ్గురు పరారీలో ఉన్నట్లు వర్ధన్నపేట సీఐ సంతోష్ తెలిపారు. మండలంలోని డీసీ తండాలో సోమవారం బానోత్ రవి రెండో భార్య అనితపై అతడి మొదటి భార్య స్వరూ ప బంధువులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీ సులు నిందితులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో హాజరుపరిచారు.

 సీఐ కథనం ప్రకారం.. డీసీ తండాకు చెందిన బానోతు రవికి అదే తండాకు చెందిన యువతితో వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత సంవత్స రం రవి అదేతండాకు చెందిన అనితను తీసుకెళ్లి తిరుపతిలో వివాహం చేసుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు రవిపై ఫిర్యాదు చేయగా అతడిపై కిడ్నాప్, అత్యాచారం కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇటీవల న్యాయస్థానంలో రవికి అనుకూలంగా తీ ర్పు వచ్చింది. దీంతో రవి అనిత డీసీ తండా లో ఉంటున్నారు. ఆదివారం రాత్రి మొదటి భార్య స్వరూప, రెండో భార్య అనిత తమను దూషిం చారని ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం స్వరూప, ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కలిసి అనిత, ఆమె తల్లి నర్సిని ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చారు. కొర్రాయితో అనితను కాలుస్తూ నిప్పులు మీద పోయడంతో పరుగెత్తింది. ఆమెను వెంబ డించి వివస్త్రను చేసి దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి భాధితులను ఆస్పత్రికి తరలించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనిత తండ్రి తావు ఫిర్యా దు మేరకు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి, వారిలో బానోతు స్వరూప, మాలోతు హేమ్ల, మాలోతు భద్రి, మాలోతు సాయిలు, బానోతు కమలమ్మ, బానోతు సాలిని అరెస్టు చేశారు. పరారీలో మాలోతు మహేష్, మాలోతు బుజ్జి, మా లోతు విజయ ఉన్నారు. సమావేశంలో ఎస్సై రవిరాజు,  సిబ్బంది పాల్గొన్నారు.



ప్రాణాపాయం లేదు : గైనకాలజిస్టు విజయలక్ష్మి

దాడికి గురైన అనిత ఆరు నెలల గర్భిణి. ఆమెకు పలుచోట్ల కాలిన గాయాలున్నాయి. గర్భంలో శిశువు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నా మరిన్ని పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఆమె కాలిన గాయాలకు చికిత్స కోసం వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తరలించాం.  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top