మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలి

మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలి - Sakshi


- ఎస్సీ వర్గీకరణ అయ్యేంత వరకు పోరాటం ఆగదు

- ఎంఎస్‌ఎఫ్ జిల్లా మహాసభలో మంద కృష్ణమాదిగ

 నకిరేకల్: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం మరో ఉద్యమానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంతోపాటు సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో వాగ్దానాలను, మోసాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలబడాలని కోరారు. నకిరేకల్‌లోని శకుంతల ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం జరిగిన మాదిగ విద్యార్థి ఫెడరేషన్ (ఎంఎస్‌ఎఫ్) జిల్లా మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉమ్మడి రిజర్వేషన్‌ల విధానంతో మాదిగలకు మూడు శాతం వాటా కూడా దక్కడం లేదన్నారు. అదే వర్గీకరణ జరిగితే 11 నుంచి 12 శాతం వరకు రిజర్వేషన్లు వర్తిస్తాయన్నారు.



తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తొలి తెలంగాణలో దళితులకు సీఎం పదవిని అప్పగిస్తానని ప్రకటించిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పాటయ్యాక పదవి ఇవ్వకుండా దళితులను మోసం చేశారని ఆరోపించారు.  తక్షణమే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రధా న మంత్రికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. వచ్చే శాసనసభలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపాలన్నారు.ఈ రెండు అంశాలతో పాటు అగ్ర పక్షాలను కూడా వెంట పెట్టుకుని ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రిని కలిసి ఒత్తిడి తేవాలని కోరారు.



కూతురు, కుమారుడు, అల్లుడు వాళ్ల శాఖలకు, స్థాయిలేని హమీలిచ్చినా వారిపై నోరు మెదపని కేసీఆర్.. దళిత డిప్యూటీ సీఎం అయిన రాజయ్యను అవమాన పరిచేలా మాట్లాడడం సరైంది కాదన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాచర్ల సైదులు, ఎంఎస్‌ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి మాట్లాడారు. అంతకుముందు నకిరేకల్‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎంఎస్‌ఎఫ్ జిల్లా ఇన్‌చార్జ్ పాల్వయి ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమయ్య, నాయకులు తూర్పింటి రవి,  కత్తి వెంకటేశ్వర్లు, గణేష్, కందుల మోహన్, కొమిరి స్వా మి, బొజ్జ సైదులు, మా చర్ల కిరణ్, వంటెపాక తిరుపతయ్య, మాచర్ల సుదర్శన్, బోడ సునీల్,  వంటల వెంకటేశ్వర్లు, పరమేష్, కందికంటి అంజయ్య, మల్లెపాక వెంకన్న, జాన్, గుండ్లపల్లి నాగరాజు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top